తెలుగు షార్ట్ ఫిలిమ్స్ హీరోయిన్ రేంజ్ నుండి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని శాసించే రేంజ్ కి వెళ్లిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

- Advertisement -

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తొలుత తెలుగు లో ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసింది. అది పెద్దగా సక్సెస్ కాలేదు,కానీ అవకాశాలను మాత్రం బాగానే తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆమెకి తమిళం లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆ సినిమా హిట్ అవ్వడం తో ఈమెకి అవకాశాలు బాగానే వచ్చాయి, కానీ ఆమె బాలీవుడ్ ని ఎంచుకుంది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అనతి కాలం లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయింది.

Guess The Actor
Guess The Actor

ఈమె కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎన్నో పోషించింది. హీరోయిన్ గా కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లోనే విలన్ రోల్స్ చేసి కూడా మెప్పించింది. ఆమె మరెవరో కాదు, ప్రియటంక చోప్రా. ఈమె ముందుగా తెలుగు లో ‘అపురూపం’ అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఇది కేవలం ఒక షార్ట్ ఫిలిం మాత్రమే.

ఇక ఆ తర్వాత తమిళం లో ఇలయథలపతి విజయ్ హీరో గా నటించిన ‘తమీజాన్’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాలీవుడ్ లోనే బడా హీరోల సరసన నటిస్తూ అక్కడ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఈమె అద్భుతమైన నటనకి గాను, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక తెలుగు లో ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ‘జంజీర్’ అనే చిత్రం లో నటించింది.

- Advertisement -

అలా ఇండియా లో సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న తర్వాత ఈమెకి హాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. 2015 వ సంవత్సరం లో ‘క్వాన్టికో’ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఈమె హాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఈమెకి ‘బే వాచ్’ సినిమాలో మెయిన్ విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ ఆమె హాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here