హీరోలకు డైరెక్టర్లకు అదే పని.. ఫోన్ చేసి రాత్రికి రమ్మనే వారు.. వాపోయిన తాప్సి

- Advertisement -

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో టాలీవుడ్ కు ఝుమ్మంది నాదం సినిమా ద్వారా పరిచయం చేసిన అందం తాప్సీ. ఫస్ట్ సినిమాతోనే అన అందచందాలు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కానీ దురదృష్టవశాతు తన తదుపరి అన్ని సినిమాల్లోనూ ఆమెకు లీడ్ హీరోయిన్ ఛాన్స్ రాలేదు. ఏ సినిమా ఒప్పుకున్నా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అయింది. దీంతో అమ్మడికి చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. ఇక్కట టైం బాగోలేదని బాలీవుడ్ దిశగా తన ప్రయత్నాలు కొనసాగించి అవకాశం దక్కించుకుంది. దీంతో వరుస సక్సెస్ లు రావడంతో అక్కడే తాప్సీ సెటిల్ అయిపోయింది. తను సినిమాలతోనే కాకుండా కాంట్రవర్సీలతో కూడా పాపులర్ అయింది. ప్రస్తుతం చాలా లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ క్వాల్షీట్లు ఖాళీ లేకుండా చూసుకుంటుంది.

తాప్సి
తాప్సి

తాప్సి వ్యక్తిగత విషయాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు బాలీవుడ్ మీద కూడా తాప్సీ పలు రకాల కామెంట్స్ చేస్తూనే ఉంది. అందుకే అందరూ తనకు కాంట్రవర్సీ క్యూన్ అని, ఫైర్ బ్రాండ్ అని ట్యాగులను కూడా తగిలించేశారు. గతంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటించిన తాప్సీ ప్రస్తుతం అందరు హీరోయిన్లకంటే కొంచెం బిజీగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఇంటర్వ్యూలో తాప్సికి కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా.. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని బాంబు పేల్చింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మొదట్లో చాలామంది ఫోన్ చేసి రాత్రుళ్లు గెస్ట్ హౌస్ కు రావాలని డిమాండ్ చేసేవారని.. నేను రానని చెప్పినప్పటికీ వారు వినేవారు కాదని వాపోయింది. అలా ఓ ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ చేయకుంటే తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తామని బెదిరింపులకు సైతం దిగారట. హీరోలే కాకుండా తనను అలా డైరెక్టర్లు కూడా బెదిరించారని తెలిపింది. వాటన్నిటిని తాను సీరియస్ గా తీసుకోలేదంటూ చెప్పుకొచ్చింది. తన మీద నమ్మకం ఉండబట్టే ఇండస్ట్రీలో ఇంతవరకు నిలబడగలిగానని చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here