బిగ్ బాస్ లోకి హాట్ యాంకర్.. హౌసులో ఇక రచ్చ రచ్చే

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లో అది సూపర్ హిట్. అలాగే తెలుగులోనూ బిగ్ బాస్ భారీ టీఆర్పీ సాధించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోగా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 మొదలవుతుంది. నాగార్జున మళ్లీ ఈ షోకు హోస్టుగా వ్యవహరించనున్నారని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక పోతే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారన్న చాలా లిస్టులు ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే బిగ్ బాస్ గత మూడు సీజన్లుగా ఓ తెలుగు హాట్ యాంకర్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ తన ఎంట్రీ మాత్రం జరగలేదు. ప్రతీసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ లిస్టులో ఆమె పేరు చేర్చడం తర్వాత తీసేయడం బిగ్ బాస్ సీజన్ 3 నుంచి వరుసగా జరుగుతూనే ఉంది.

Anchor Varshini
Anchor Varshini

అయితే ఆమె ఈసారి కంపల్సరిగా ఆమె వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ సారి బిగ్ బాస్ 7 కంటిస్టెంట్స్‌ లిస్టులో కూడా మొదట్లోనే ఈమె పేరు వినిపిస్తుంది. అయితే ఈ రాబోయే సీజన్లో దాదాపు 18 నుంచి 20 మంది హౌస్ మెట్స్ ఉంటారని తెలుస్తోంది. అందులో బుల్లి తెరపై బాగా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ వర్షిణి కూడా ఉన్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని కుర్రకారుకు అందాల విందు చేస్తున్న వర్షిణి హౌసులో ఎంట్రీ ఇస్తుందన్న వార్తులు సీజన్ 3 నుంచి వస్తూనే ఉన్నాయి.. కానీ లాస్ట్ లో ఎందుకో ఛాన్స్ మిస్ చేసుకుంటుంది. మరి ఈ సారైన వర్షిణి బిగ్ బాసుకు వస్తుందా.. ఢీ టీం లీడ్ చేసిన అందాల హాట్ భామకు అందులో బాగానే మార్కులు పడ్డాయి. ఎందుకో ఆ తర్వాత అమ్మడు కనిపించలేదు. తరువాత స్టార్ మా లో అదిరింది షోకు హోస్టుగా చేసింది. ఈ మధ్యకాలంలో పెద్దగా బుల్లితెరపై కూడా కనిపించిన దాఖలాల్లేవు. వర్షిని కెరీర్ ని ఎందుకంత లైట్ గా తీసుకుందో తెలియాల్సి ఉంది. తెరపై కనిపించకున్నా అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. కుర్రకారుకు అందాల కనువిందు చేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా ఫోటో, వీడియోలతో అభిమానులను అలరిస్తూనే ఉంది. అలాంటి వర్షిణి బిగ్ బాస్ సీజన్ 7కు వస్తుందా రాదా.. అసలు ఆమె గత సీజన్లకు అడ్డుపడింది ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here