పెళ్లిచేసుకోనున్న బిగ్ బాస్ దివి.. పారాణి ఫొటోలు షేర్ చేసి రచ్చ చేస్తోంది

- Advertisement -

అటు అందం, ఇటు నటన రెండూ ఉన్న ముద్దుగుమ్మ బిగ్ బాస్ దివి వాద్య. కావాల్సినంత అందం ఉన్నా దివికి ఇప్పటివరకు అదృష్టం కలిసి రాలేదు. బిగ్‌బాస్-4తో ప్రేక్షకులకు దగ్గరైన దివి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ పొడుగు కాళ్ల సుందరికి.. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ మధ్య ఏమైందో ఏంటో కానీ అందాల ఆరబోతలో దివి ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. హాట్ ఫొటోలు, క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాజాగా దివికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. తను పెళ్లి చేసుకోనుందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది.

బిగ్ బాస్ దివి
బిగ్ బాస్ దివి

కవ్వించే నీలి కళ్లు.. కైపెక్కించే చూపులు.. వొంపు సొంపుల వయ్యారాలు.. హస్కీ వాయిస్‌తో దివి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటివరకూ దివికి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ దొరకలేదు.తాజాగా ఇన్ స్టాలో ఫొటోలు షేర్ చేసిన దివి ‘నేనూ, నా పారాణి నీకోసం ఎదురుచూస్తున్నాం’ అని రాసింది. దీంతో అందరూ ఆమెకు పెళ్లి కుదిరిందంటున్నారు. మరోవైపు ఈ ఫొటోలపై కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పైట లేకుండా ఏంటి అలా పోజులు ఇస్తున్నావు. ఆడపిల్లలా ఉండు అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి తనకు డీసెంట్ గా ఉండే అబ్బాయిలంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఈరోజు మాత్రం దివి ఫొటోలు రచ్చ చేస్తున్నాయి.

బిగ్ బాస్ దివి

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ‘మహర్షి’ ద్వారా అడుగుపెట్టింది దివి. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4తో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా దివి సొట్ట బుగ్గలకు ఫ్యాన్స్ పడి చస్తారు. మత్తెక్కించే కళ్లతో నాజూకు నడుముతో దివి షేర్ చేసే ఫొటోలు వేరే లెవల్ అంటూ ఫాలోవర్లు కామెంట్లు పెడుతుంటారు. ఈ మధ్య దివి.. చీరలోనూ దివి అందాల విందు చేసింది. ఈ అమ్మడికి అందుకే సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here