Disha Patani : టైగర్ తో బ్రేకప్ ఖాయమైనట్టేనా.. మిస్టీరియస్ మ్యాన్ తో దిశా పటానీ ఫొటోలు వైరల్

- Advertisement -

బాలీవుడ్‌ యంగ్​ హీరో టైగర్ ష్రాఫ్-బోల్డ్ బ్యూటీ దిశాపటానీ కొన్నేళ్లుగా రిలేషన్​షిప్​లో ఉన్నారు. లవ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఖాళీ ఉన్న సమయంలో షికార్లు కొడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. అయితే ఈ జంట్​ బ్రేకప్​ చెప్పుకుందంటూ కొద్ది రోజులుగా తెగ వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకి వచ్చిన టైగర్ ను హోస్ట్ కరణ్ జోహర్.. దిషాతో బ్రేకప్ గురించి అడగ్గా.. దిశ తనకు మంచి ఫ్రెండ్ అని తను ఎప్పటి నుంచో సింగిల్ గానే ఉన్నానని.. రిలేషన్ షిప్ లో ఎప్పుడూ లేనని క్లారిటీ ఇచ్చాడు. టైగర్ క్లారిటీపై ఎవరికీ నమ్మకం కుదరలేదు.

 

మరోవైపు దిశ టైగర్ చెల్లెలు కిషూ ష్రాఫ్ తో చట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. వీరిద్దరి డిన్నర్ డేట్స్, పార్టీలకు కలిసే వెళ్తుంటారు. ఇంకోవైపు టైగర్ తల్లి అయేషాకి కూడా దిశా అంటే చాలా ఇష్టం. టైగర్ తో బ్రేకప్ అయినా దిశ అతడి ఫ్యామిలీతో తన రిలేషన్ ఇంకా సాగిస్తోందని బీటౌన్ కోడై కూస్తోంది. మరికొందరేమో వాళ్లిద్దరికి బ్రేకప్ అవ్వలేదంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా రోజులుగా వీళ్లిద్దరు కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ అయ్యే ఉంటందని ఇంకొందరు గుసగుసలాడుతున్నారు. ఇప్పటి వరకు వీరి బ్రేకప్, రిలేషన్షిప్ గురించి క్లారిటీ రాలేదు.

- Advertisement -
Disha Patani
Disha Patani

బీటౌన్ బ్యూటీ దిశా పటానీ హీరో టైగర్ ష్రాఫ్​తో​ విడిపోయినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆమె మరో వ్యక్తితో తరచూ కలిసి కనిపించడంతో పుకార్లు ఊపందుకుంటున్నాయి. దిశ షేర్​ చేసిన సెల్ఫీ ఫొటోలు ఈ కొత్త చర్చకి దారి తీశాయి. కారులో ఓ వ్యక్తితో కలిసి హాట్‌ లుక్‌లో సెల్ఫీ దిగింది. అవి ప్రస్తుతం వైరల్​ అవుతున్నాయి. ఎవరా మిస్టిరీయస్​ పర్సన్​ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇవే కాకుండా జిమ్ లో, బోట్ లో కూడా దిశ ఆ వ్యక్తితో చాలా క్లోజ్ గా ఫొటోలు దిగింది. అతడు దిశ కొత్త బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని చాలా మంది అనుకుంటున్నారు. మరికొందరేమో.. అతడు దిశా ఫిట్​నెస్​ ట్రైనర్​ అని అంటున్నారు. ఇంతకీ ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరనేది ఎవరికీ తెలియదు. అతడి గురించే సోషల్ మీడియాలో చర్చంతా.

ఇదిలా ఉండగా.. ఇటీవల టైగర్ ష్రాఫ్ కూడా మరో కొత్త భామ ఆకాంక్ష శర్మ​తో ప్రేమలో పడ్డాడని ప్రచారం మొదలైంది. మోడల్​గా కెరీర్​గా ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ సంతూర్​ సోప్​ యాడ్​తో పాపులర్​ అయింది. కన్నడలోనూ ఓ సినిమా చేసింది. టైగర్​తో కలిసి రెండు మ్యూజిక్​ ఆల్బమ్స్​లోనూ చిందులేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా అవకాశాల కోసం బాగా ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ ​మీడియాలోనూ తన లేత అందాలను పోస్ట్​ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. దిశతో బ్రేకప్ ఆకాంక్ష వల్లే అయిందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొందరేమో బ్రేకప్ అయ్యాక టైగర్ చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అయ్యాడని మాట్లాడుకుంటున్నారు.

ఇటు రిలేషన్ షిప్ గురించి కానీ.. అటు బ్రేకప్ గురించి కానీ దిశ- టైగర్ ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా ఇంటర్వ్యూల్లో.. సినిమా ప్రమోషన్స్ లో వీళ్ల బంధం గురించి ప్రశ్నించినా మాట దాటేసేవారు. లేదా తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పేవారు. ఇప్పుడు ఇద్దరూ వేరే వ్యక్తులతో రిలేషన్ షిప్లో ఉన్నట్లు వస్తోన్న పుకార్లపై కూడా దిశ-టైగర్ లు స్పందించలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here