Director Vetrimaaran : ఎన్టీఆర్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన వెట్రిమారన్.. అల్లు అర్జున్ తో మొదటి సినిమా..

- Advertisement -

తమిళ స్టార్ Director Vetrimaaran గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెసేజ్ ఉన్న సినిమాలను తెరకేక్కిస్తూ జనాల్లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు. ఒకప్పుడు తమిళనాడులో అనగారిన వర్గాలు అనుభవించిన బాధలను తెరపై ప్రేక్షకులు మెచ్చేలా ఆవిష్కరించడంలో వెట్రిమారన్ దిట్ట. ‘అసురన్’ సినిమాతో తెలుగులోనూ వెట్రిమారన్ పేరు మారుమోగింది. అయితే, ఈయన దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే..అందుకు కారణం కూడా లేకపోలేదు..లాక్‌డౌన్ తరవాత ఎన్టీఆర్, వెట్రిమారన్ కలుసుకోవడమే ఆ వార్తకు కారణం..ఎన్టీఆర్ కు మెసేజ్ కంటెంట్ ను వినిపించారని అది బాగా వినిపించడంతో ఆయన ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి..

Director Vetrimaaran
Director Vetrimaaran

తాజాగా ఆ వార్తలకు చెక్ పెట్టేశాడు డైరెక్టర్.. వెట్రిమారన్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విడుదలై: పార్ట్‌-1’. మార్చి 31న తమిళంలో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో ‘విడుదల: పార్ట్‌-1’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ఈ సందర్బంగా డైరెక్టర్ ను విలేకర్లు ప్రశ్నించారు.. ఎన్టీఆర్ సినిమా ఎప్పుడని అడగ్గా దానికి సమాధానం ఇచ్చాడు.. తాను ఎన్టీఆర్‌ను మాత్రమే కలవలేదని అంతకు ముందే అల్లు అర్జున్, మహేష్ బాబును కలిశానని వెట్రిమారన్ వెల్లడించారు.

Vetrimaaran ntr

‘ఆడుకాలం సినిమా తర్వాత అల్లు అర్జున్‌‌ను నేను కలిశాను. తాను తమిళంలో సినిమా చేయాలనుకుంటున్నారని, నాకు ఆసక్తి ఉంటే కథ చెప్పమని అడిగారు. అప్పుడు నేను రాసుకున్న ‘వడ చెన్నై’లో ఒక పవర్‌ఫుల్‌ రోల్ గురించి బన్నీకి చెప్పాను. కానీ, ఎందుకో కుదరలేదు.. తర్వాత కథను మార్చి సినిమాను చేసినట్లు తెలిపారు..

- Advertisement -

అల్లు అర్జున్‌ను కలిసిన తరవాత మహేష్ బాబును కూడా తాను కలిసి ఒక కథ చెప్పానని వెట్రిమారన్ తెలిపారు. అయితే, ఆ సినిమా కూడా ఎందుకో కుదరలేదని అన్నారు. ఇక ‘అసురన్‌’ మూవీ తర్వాత, లాక్‌డౌన్‌ తర్వాత ఎన్టీఆర్ ను కలిసిన మాట నిజమే కానీ అతనికి నేను కథను చెప్పలేదు.. ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి అసలు తాను కథే రాసుకోలేదని అన్నారు. దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. స్టార్ వాల్యూ, కాంబినేషన్ వాల్యూ కాకుండా తాను ఎంచుకునే కంటెంట్ కు తగ్గట్లు ఉంటే ఆ హీరోతోనే సినిమా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here