Guna Shekar : ‘శాకుంతలం’ ప్రొమోషన్స్ కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న గుణ శేఖర్

- Advertisement -

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అతి కొద్దీ మంది డైరెక్టర్స్ లో ఒకడు ‘Guna Shekar’..లాఠీ అనే సినిమా ద్వారా 1992 వ సంవత్సరం లో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన గుణ శేఖర్ ఆ తర్వాత చిన్నపిల్లలతో ‘బాల రామాయణం’ అనే సినిమా తీసి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు..జూనియర్ ఎన్టీఆర్ ఇందులో శ్రీరాముడిగా నటించాడు..ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

Guna Shekar
Guna Shekar

ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో ‘చూడాలని ఉంది’ అనే సినిమా తీసి కమర్షియల్ గా సంచలన విజయం అందుకున్న గుణ శేఖర్ ఆ తర్వాత ‘ఒక్కడు’ సినిమాతో ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు..కేవలం ఈ రెండు సినిమాలే ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి..మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు..ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘శాకుంతలం’ ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

samantha in shakuntalam movie

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని గుణ శేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా అనుకోని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.. ఇటీవలే ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యగా, పర్వాలేదనే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది..ఈ చిత్రానికి గుణ శేఖర్ తో పాటు దిల్ రాజు కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు..అయితే విడుదల దగ్గర పడుతున్నప్పటికీ కూడా ప్రొమోషన్స్ చెయ్యకపోవడం ఆశ్చర్యార్ధకం గా అనిపిస్తుంది..అందుకు కారణం గుణ శేఖర్ కి ఉన్న ఆర్ధిక ఇబ్బందులే అని తెలుస్తుంది.

- Advertisement -
samantha

ఒప్పందం ప్రకారం మూవీ ప్రొమోషన్స్ మరియు పబ్లిసిటీ కి అయ్యే ఖర్చులు మొత్తం గుణశేఖర్ భరించాల్సి ఉంది.. కానీ ఆయనకీ అందుకు కావాల్సిన బడ్జెట్ లేకపోవడం బాధాకరం.. దిల్ రాజు ఈ విషయం లో చూసి చూడనట్టు గా ప్రవర్తిస్తున్నాడు.. సినిమా ఔట్పుట్ సరిగా రాలేదని.. అందుకే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ పై మరో పైసా ఎక్కువ పెట్టినా నష్టం వస్తుందనే అంచనా తో సైలెంట్ గా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి గుణ శేఖర్ ఒక్కడే ఈ భారాన్ని ఎలా మోస్తాడో చూడాలి.

Shakuntalam movie
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here