వివాదాలకు కెరాఫ్ అంటే Ram Gopal Varma..ఆ విషయంలో నో డౌట్..తనకు సంబంధంలేని ఏదొక దానిపై స్పందిస్తూ అందరితో చివాట్లు తినడం ఆయనకు అలవాటే.. అందుకే ఆయనను కొందరు సైకో వర్మ అనికూడా అంటారు.అప్పట్లోనే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి ప్రస్తుతం వివాదాస్పద సినిమాలు తీస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన మీద ఉన్న స్టార్ ఇమేజ్ ని మొత్తం పాడు చేసుకున్నారు ram gopal varma.. అంతే కాదు ఈ మధ్యకాలంలో ఈయన్ని చాలామంది తిట్టుకుంటున్నారు కూడా. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈయన తండ్రి చనిపోయినప్పుడు ఏ కొడుకు ప్రవర్తించిన విధంగా ప్రవర్తించాడట.ఇంతకీ ఆయన ఎందుకు అలా చేశారో తెలుసుకుందాం పదండి..
ఆయన తండ్రి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారని తన ఫ్రెండ్ ఫోన్ చేశారట.. దాంతో రాంగోపాల్ వర్మ కంగారుపడుతూ ఆయన ఫ్రెండ్ కి నాన్న డెడ్ బాడిని హైదరాబాద్ కి తీసుకురా అని చెప్పారట. అలాగే తన అమ్మ కంగారు పడుతుందో ఏమోనని ఆ విషయం అమ్మకి చెప్పకుండా కొంతమంది బంధువులకు ఫోన్ చేసి మా నాన్న చనిపోయారు మీరు ఇప్పుడు మా ఇంటికి రావద్దు మీరు వచ్చి మా అమ్మను ఏడిపించకండి, మా అమ్మ కంగారు పడుతుంది.
మీరందరూ రేపే రండి అంటూ ఫోన్ చేసి చెప్పాడట. అంతేకాదు తన తల్లికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక నాన్నకి గుండెపోటు వచ్చిందట ఇక్కడికి తీసుకు వస్తున్నారట అని అబద్ధం చెప్పి అలాగే దారి మధ్యలో విపరీతమైన హార్ట్ ఎటాక్ రావడం వల్ల హైదరాబాద్ కి చేరుకునే లోపే తన తాను చనిపోయాడు అని ఒక అబద్ధాన్ని తన తల్లికి చెప్పాలనుకున్నాడు.
అయితే ఆరోజు నైట్ డెడ్ బాడీని రాంగోపాల్ వర్మ తన ఇంటికి తీసుకురాకుండా తన ఫ్రెండు ఇంటి దగ్గరే రాత్రి మొత్తం ఉంచాడు. తండ్రి చనిపోతే ఏ కొడుకు చేయని పనిచేశాడట. అంతేకాదు చిన్న కర్మ పెద్దకర్మ లాంటివి ఏమీ అవసరం లేదు అనికూడా చెప్పారట. కానీ తన తల్లి బలవంతం పెట్టి ఏడవడంతో తల్లిని చూడలేక చిన్నకర్మ చేశాడట. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది దుమ్మెత్తి పోశారు..