Chiranjeevi నటించిన ఏకైక టీవీ సీరియల్ అదేనా!..ఇప్పుడు ఆ సీరియల్ ని ఎక్కడ చూడొచ్చు?

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ Chiranjeevi గురించి తెలియని వాళ్లంటూ ఉండరు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, తన స్వయం కృషి తో ఎన్నో కష్టనష్టాలను ఎదురుకొని మెగాస్టార్ గా ఎదిగి సుమారు నాలుగు దశాబ్దాల నుండి నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు.

Chiranjeevi
Chiranjeevi

68 ఏళ్ళ వయస్సు లో కూడా 140 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టే రేంజ్ లో ఉన్నాడంటే జనాల్లో ఆయన సృష్టించుకున్న బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.కెరీర్ లో ప్రారంభం లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, నెగటివ్ రోల్స్ మరియు సైడ్ క్యారక్టర్ రోల్స్ కూడా చేసాడు చిరంజీవి.అయితే ఆయన గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

CHiranjeevi news

అదేమిటీ అంటే చిరంజీవి తన మొదటి సినిమా పునాది రాళ్లు సమయం లోనే సమాంతరంగా ఒక బాలీవుడ్ డైలీ సీరియల్ లో నటించాడట. ఆ సీరియల్ పేరు రజని. ఇందులో చిరంజీవి పోషించింది చిన్న పాత్రనే, కొన్ని ఎపిసోడ్స్ లో మాత్రమే కనిపిస్తాడు, ఆ తర్వాత ఆయనకీ సినిమాల్లో అవకాశాల వెల్లువ కురవడం తో ఆ సీరియల్ మానేసాడు.తర్వాత ఆయన స్థానం లోకి మరో నటుడు వచ్చాడు.ఆ సీరియల్ పేరు రజని అట.

- Advertisement -
mega star CHiranjeevi

అప్పట్లో దూరదర్శన్ లో ఈ సీరియల్ తరచూ ప్రసారం అయ్యేది అట. చిరంజీవి ఒక సీరియల్ లో నటించాడని విషయం ఆయన వీరాభిమానులకు సైతం తెలియదు.ఇప్పుడు ఈ వార్త తెలియడంతో ఆ సీరియల్ ఎక్కడ ఉందో వెతకడం ప్రారంభించారు. ఇక చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మొన్ననే ‘వాల్తేరు వీరయ్య‘ తో గ్రాండ్ హిట్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాతో ఆగస్టు 11 వ తేదీన మన ముందుకి రాబోతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here