Megastar Chiranjeevi కొన్న ఈ కొత్త కార్ ధరతో ఒక పెద్ద బంగ్లా కట్టేయొచ్చు..!

- Advertisement -

మన Megastar Chiranjeevi కి కార్లు అంటే ఎంత మక్కువో మన అందరికీ తెలిసిందే, మార్కెట్ లో వచ్చిన కొత్త లగ్జరీ బ్రాండెడ్ కార్స్ ని వెతికిపట్టుకొని మరి కొనడం చిరంజీవి కి అలవాటు. అలా ఆయన కార్ గ్యారేజ్ లో సుమారుగా 10 కి పైగా కార్లు ఉన్నాయి.రోల్స్ రాయల్స్ దగ్గర నుండి స్పోర్ట్స్ కార్స్ వరకు అన్నీ బ్రాండెడ్ కంపెనీలవే ఉన్నాయి.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

ఇక రీసెంట్ గానే మార్కెట్ లో వచ్చిన టయోటా బ్రాండ్ న్యూ మోడల్ ని కొనుగోలు చేసాడు మన మెగాస్టార్.దీని ధర సుమారుగా కోటి 18 లక్షల రూపాయిల వరకు ఉంటుందట.అత్యాధునిక టెక్నాలజీ తో కార్ లో ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టం కూడా ఉంటుందట.ఈ కార్ ని రిజిస్ట్రేషన్ చేయిస్తున్న సమయం లో తీసిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Megastar Chiranjeevi new Car

ఎంత వయసొచ్చినా కుర్రాళ్ల ఆలోచనలకూ తగ్గట్టుగా చిరంజీవి చర్యలు ఉంటాయి, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకంటే ఫాస్ట్ గా ఉంటాడు కూడా.అది సినిమా అయినా, మిగిలిన ఏ విషయం లో అయినా మెగాస్టార్ కి మెగాస్టార్ మాత్రమే పోటీ.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకి గాను 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు.రెమ్యూనరేషన్ వచ్చిన ప్రతీ సారి ఆయన కొనే ఐటమ్స్ గాడ్జెట్స్ మరియు కార్స్.

- Advertisement -
Chiranjeevi new car price

ఇది ఇలా ఉండగా ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి సుమారు గా 140 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న చిరంజీవి, ఇప్పుడు మెహర్ రమేష్ తో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆగష్టు 11 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నట్టు ఇది వరకే అధికారిక ప్రకటన కూడా చేసారు మేకర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here