Dhanush : రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధనుష్.. అమ్మాయి ఎవరో తెలుసా ?

- Advertisement -

Dhanush : కోలీవుడ్‌లో స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారు 2004లో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కలిగారు. అయితే ఐశ్వర్య ధనుష్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అతని సోదరుడు సెల్వరాఘవన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. 2012లో విడుదలైన 3 చిత్రంతో దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలోని వై దిస్ కొలవెరి పాట విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. పాటలు హిట్ అయినంతగా సినిమా మాత్రం ఎందుకో హిట్ కాలేదు. ఇలా వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐశ్వర్య సినిమాలకు కాస్త గ్యా్ప్ ఇచ్చి వ్యక్తిగత జీవితం పై దృష్టి సారించింది. అంతే కాకుండా ఫిట్‌నెస్‌పై ఆసక్తి కనబరుస్తూ వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలను నిత్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ధనుష్ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక్కసారిగా డివోర్స్ కలకలం రేగింది.

2022 లో విడాకులు తీసుకుని విడిపోబోతున్నట్లు ధనుష్ ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం.. ఇటు రజనీ కాంత్ తో పాటు వారి అభిమానులకు షాక్ అనిపించింది. ఇరువైపులా బంధువులతో చర్చలు జరిపి డివోర్స్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ధనుష్, ఐశ్వర్య రెండేళ్ల తర్వాత విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి ఉండే అవకాశం లేదని కోర్టు మెట్లు ఎక్కడంతో విడాకులు తీసుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఎలాగైనా తన కొడుకు మనసు మార్చాలని ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. దీంతో ఆయన తన కొడుకుకు మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పు మంటున్నాయి. ఇక సినిమాల్లో నటించే అమ్మాయిలు వద్దని డిసైడ్ అయ్యి, ఇప్పుడు బంధువులలో వేరే అమ్మాయిని చూస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. కోలీవుడ్‌లో ధనుష్ రెండో పెళ్లి ఈ వార్త మాత్రం హాట్ టాపిక్‌గా నడుస్తుంది.

- Advertisement -

dhanush

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here