Review : ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ ఫుల్ రివ్యూ..కిరణ్ అబ్బవరం టైం స్టార్ట్ అయ్యినట్టేనా!

- Advertisement -

Review : నటీనటులు : కిరణ్ అబ్బవరం, కాశ్మిరీ పరదేశి, మురళీ శర్మ,శుభలేఖ సుధాకర్, ప్రవీణ్ తదితరులు

బ్యానర్ : గీత ఆర్ట్స్
నిర్మాతలు : బన్నీ వాసు
డైరెక్టర్ : మురళీ కిషోర్
మ్యూజిక్ డైరెక్టర్ : చైతన్ భరద్వాజ్

తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ మరియు క్రేజ్ దక్కించుకున్న అతి తక్కువ మందిలో ఒకరు కిరణ్ అబ్బవరం.’SR కల్యాణ మండపం’ సినిమాతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ccc, ఆ తర్వాత యూత్ కి బాగా దగ్గరయ్యే సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.ముఖ్యంగా లేడీస్ లో ఇతగాడి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.అయితే ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి వేరే లెవెల్ కి చేరుకునేఉందుకు కిరణ్ అబ్బవరం చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు.ఆ ప్రయత్నం లో భాగంగానే గీత ఆర్ట్స్ బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమా తీసాడు.టీజర్ మరియు ట్రైలర్ తోనే సరికొత్త కథాంశం అని అనిపించుకున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

- Advertisement -
Review
Review

కథ :

విష్ణు అనే అబ్బాయి(కిరణ్ అబ్బవరం) ఒక ప్రముఖ లైబ్రరీ లో పని చేస్తూ ఉంటాడు.మంచితనం తో ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చెయ్యడం ఆయనకీ ఉన్న గొప్ప లక్షణం.అయితే నెంబర్ నైబరింగ్ అనే ఐడియాతో అతనికి దర్శన (కాశ్మిరీ పరదేశి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది.ఆమె ఒక యూట్యూబర్.క్రేజీ వీడియోలను షూట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి బాగా ఫేమస్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ ఒక్క వీడియో కూడా సక్సెస్ అవ్వదు.అయితే విష్ణు సహాయం తీసుకొని వీడియోలు చేసి పాపులర్ అవ్వాలని అనుకుంటుంది.మరో పక్క అదే నెంబర్ నైబరింగ్ అనే ఐడియా తో శర్మ (మురళీ శర్మ) అనే వ్యక్తి కూడా పరిచయం అవుతాడు.అతనితో కూడా ఈమె వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంది.ఈ క్రమం లో విష్ణు మరియు దర్శన ప్రేమించుకుంటారు.అలా కొనసాగుతూ ఉండగా ఒక రోజు దర్శన కి లైవ్ మర్డర్ ప్రాంక్ చేసి యూట్యూబ్ లో పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది.అనుకున్నట్టుగానే శర్మ తో ఆ ప్రాంక్ ప్లాన్ చెయ్యగా అతను నిజంగానే చనిపోతాడు.దీనితో దర్శన కి ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది.శర్మ నిజంగానే చనిపోయాడా..? ఈ కథలోకి టెర్రరిస్టులు ఎందుకు వచ్చారు?, హీరో హీరోయిన్ ని జైలు శిక్ష నుండి ఎలా కాపాడాడు అనేది వెండితెర మీద చూడాల్సిందే.

vinaro bhagyamu vishnu katha
vinaro bhagyamu vishnu katha

విశ్లేషణ :

కిరణ్ అబ్బవరం తన ప్రతీ సినిమాతో ఒక సరికొత్త సందేశం ఇవ్వాలని తాపత్రయం పడుతూ ఉంటాడు.కానీ అవి ఇన్ని రోజులు క్లిక్ అవ్వలేదు కానీ ఈసారి మాత్రం గట్టిగా క్లిక్ అయ్యింది.ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో స్క్రీన్ ప్లే చకచకా నడిపించాడు డైరెక్టర్ మురళీ కిషోర్.దర్శకుడిగా ఇది ఆయనకీ తొలి సినిమానే అయ్యినప్పటికీ ఎక్కడా కూడా ఆ ఫీలింగ్ రాదు.ఒకపక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరో పక్క ట్విస్టులతో ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చెయ్యడం సక్సెస్ అయ్యాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతాది.హీరోయిన్ పై కావాలనే కుట్ర చేసి మర్డర్ కేసు లో ఇరికించడం, ఇంతకీ ఇవ్వన్నీ ఎవరు చేస్తున్నారు అనే థ్రిల్లింగ్ పాయింట్ ని విజయవంతంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్.ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ కంటే కూడా, మురళీ శర్మ మరియు హీరోయిన్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.

అయితే ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ ప్యాకేజి లాగ ఉంటుందో,సెకండ్ హాఫ్ అంత సీరియస్ గా సాగుతాది.సెకండ్ గల్ఫ్ మొత్తం హీరోయిన్ ని జైలు నుండి ఎలా బయటకి తీసుకొని రావాలి అనే పాయింట్ మీద హీరో చేసే పోరాటం కాస్త బోర్ కొట్టిస్తాయి కానీ, ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే మరో ట్విస్ట్ కూడా ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేస్తుంది.ఇక నటీనటుల విషయానికి వస్తే ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమా అని చెప్పుకోవచ్చు.ఇక మురళీ శర్మకి కూడా చాలా కాలం తర్వాత నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రని పోషించే ఛాన్స్ దక్కింది.హీరోయిన్ కాశ్మిరీ పరదేశి కూడా ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ లో ఒకటిగా నిల్చింది.

చివరి మాట :

ఎంటర్టైన్మెంట్ తో పాటుగా థ్రిల్లింగ్ అంశాలను కమర్షియల్ ఫార్మటు లో చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్.ఈ వీకెండ్ కి మరో మంచి సినిమా..థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చెయ్యండి.

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here