ప్రభాస్ దెబ్బకు జాగ్రత్త పడుతోన్న ఎన్టీఆర్..!

- Advertisement -

ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు లీకుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. సినిమ రిలీజ్ కాకముందే సెట్ నుంచి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లీకులు కాకుండా మేకర్స్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ లీక్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది. ఇక ఈ మధ్యనే ప్రభాస్ నటించిన కల్కి చిత్రం నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

ఇక కల్కి లుక్ లీక్ అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. దీంతో దేవర చిత్రబృందం అలర్ట్ అయ్యిందని టాక్ వస్తుంది. మొదటి నుంచి కూడా ఈ సినిమాను ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నారు శివ కొరటాల, ఎన్టీఆర్. ఈ సినిమా వీరిద్దరికీ ఎంత ముఖ్యమో కూడా అందరికీ తెలిసిందే. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం దేవర. ఇక ఇటుపక్క ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా రాజమౌళి సెంటిమెంట్ ను ఎలాగైనా బ్రేక్ చేయాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడు.

దీంతోనే ఈ సినిమా అత్యంత అద్భుతంగా రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యేంతవరకు ఒక్క ఫోటో కూడా బయటికి రాకూడదని ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే దేవర షూటింగ్ స్పాట్ కు 24 క్రాఫ్ట్ కి సంబంధించిన ఏ ఒక్కరు కూడా సెల్ ఫోన్లు తీసుకు రాకూడదని ఆర్డర్స్ వేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అన్న విషయం కూడా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారంట. అంటే ఒక విధంగా సైలెంట్ గా దేవర పని చేస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా కల్కి ఎఫెక్ట్ కి దేవర ఇలా సీరియస్ అయ్యాడని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here