Prabhas ను మ‌ళ్లీ అలా చూడ‌లేమా.. కల్కి అప్ డేట్ పై కామెంట్స్‌

- Advertisement -

Prabhas : “కల్కి 2898AD.. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరి ఆశలు, అంచనాలు ఈ సినిమాపైనే. ఈ సినిమా బడ్జెట్ గురించి ఇప్పటి వరకు చాలా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాపై అందరూ ఓ రేంజ్ లో అంచనాలు పెంచుతున్నారు.. ఇక ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి ఒక్కొక్కటిగా వస్తున్న అప్ డేట్స్ మరిన్ని ఆశలు పెంచుతున్నాయి.

అసలు ఈ సినిమా రిలీజ్ కాకముందే.. ఈ రేంజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి హడావిడి చేస్తారో.. అనే ఊహాగానాలు ఇప్పటికి మొదలయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించిన ఓ అప్ డేట్ శివరాత్రి స్పెషల్ పోస్టర్ తో రాబోతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం “కల్కి 2898 AD”. ఈ వేసవిని మే 9న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండబోతోందన్న సంగతి కూడా తెలిసిందే.

Prabhas

ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అయింది. రెండో భాగం షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో ఓ రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా… ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ తో కల్కి సినిమాలో ప్రభాస్ పేరును రివీల్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ వార్త అభిమానులకు పండగలా మారింది. కల్కి సినిమాలో ప్రభాస్ పేరును బట్టి హీరో క్యారెక్టర్ ఏంటనేది దాదాపుగా అంచనా వేయవచ్చని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మ‌రికొంద‌రైతే ప్ర‌భాస్ ను డార్లింగ్ లా ఎప్పుడు చూస్తామో.. అంత హ్యాండ్స‌మ్ గా ఎప్పుడు చూస్తాం అన్నారు. అప్ప‌టి హ్యాండ్సమ్ లుక్ ను మేము మిస్ అవుతున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

కానీ ఇప్పుడు కూడా ప్ర‌భాస్ లుక్ ను చూసి చాలా మంది అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి కొంద‌రైతే బ‌హుబ‌లి తో డార్లింగ్ లుక్ అంతా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదైతేనేం ప్ర‌భాస్ లుక్ అంతా మాత్రం ముందులా లేద‌ని చెబుతున్నారు. అలాగే కల్కి సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్ పై ఆశలు పెట్టుకున్న అభిమానులు.. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి హడావిడి చేస్తారో.. అనేది ఎవరి ఊహ. మరి రంగస్థలం తర్వాత ఈ సినిమా ఇంకెంత క్రేజ్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. అలాగే ఈలోపు ఈ సినిమాపై ఇంకా ఎన్ని అప్ డేట్స్ వస్తాయో, ఇంకా ఎంత ఉత్కంఠను పెంచుతాయో.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here