Salaar Movie : థియేటర్ యాజమాన్యం భారీ కుట్ర.. ‘సలార్’ మూవీ చూడనివ్వకుండా అడ్డుకుంటున్న వైనం ?

- Advertisement -

Salaar Movie : రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ వార్త ట్రెండ్ చేస్తున్నారు. సలార్ సినిమా కలెక్షన్లను అడ్డుకునేందుకు భారీ కుట్ర జరుగుతోందా..? అంటే అవుననే అంటున్నారు. చిన్న పిల్లలను థియేటర్లలోకి రానివ్వడం లేదని కొందరు తల్లిదండ్రులు థియేటర్ల వద్ద గొడవ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవలే సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలను ప్రశాంత్ నీల్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. జగపతి బాబు, శ్రేయా రెడ్డి, శృతి హాసన్, టిన్ను ఆనంద్ తదితర తారాగణం నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అభిమానులు ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు లాంగ్ లీవ్స్ రావడంతో ఫ్యామిలీ అంతా కలిసి సలార్ సినిమా చూసేందుకు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.

Salaar Movie
Salaar Movie

అయితే సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా సినిమాల విషయంలో లైట్ తీసుకునే థియేటర్ యాజమాన్యం సలార్ విషయంలో మాత్రం మితిమీరి ప్రవర్తిస్తోంది. చిన్న పిల్లలు ఈ సినిమా చూడకూడదని పిల్లలను థియేటర్ బయటే ఆపేస్తున్నారు. అంతేకాదు టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు ఈ విషయం చెబితే బాగుండేదని జనాలు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ డీఎస్‌ఎల్ మాల్‌లో ఓ కుటుంబం థియేటర్ యజమానితో గొడవకు దిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే డర్టీ సీన్స్‌ ఉన్న సినిమాల్లోకి చిన్న పిల్లలను థియేటర్లలోకి అనుమతిస్తున్నారు. మన తెలుగు హీరో నటించిన సినిమా విషయంలో మాత్రం చాలా ఓవర్ చేస్తుందంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here