Allu Arjun : ఆ సినిమా చేసినందుకు నాకు ఒక‌ పైసా ఇవ్వలేదు.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -


Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్జున్ ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సీక్వెల్ లో న‌టిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాల విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ ఏ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కచ్చితంగా తన మొదటి సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. బన్నీ గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

Allu Arjun
Allu Arjun

అయితే ఈ సినిమా కంటే ముందే ఆయన కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలా ఆయ‌న‌ నటించిన సినిమాల్లో మొదటి చిత్రం విజేత. చిరంజీవి హీరోగా నటించిన సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్లో బన్నీ చైల్డ్‌ఆర్టిస్ట్‌గా నటించాడు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో అల్లు రామలింగయ్య సమర్పణలో అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మించాడు. ఇక ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్వీట్ మెమోరీస్‌ను అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నాడు.

Allu Arjun Photos

విజేత 100 డేస్ షీల్డ్ తో అల్లు అరవింద్ నవ్వుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. నా మొదటి సినిమా విజేత.. దానికి మా డాడీ ప్రొడ్యూసర్ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. ఓ మై గాడ్.. ఈ సినిమాకు మా నాన్న నాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ అంతా అన్నా నువ్వు ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించావా అంటూ.. వెంటనే మీ డాడీని అడిగి తీసేసుకో అంటూ.. నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వ‌చ్చే ఏడాది పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో బన్నీ మరోసారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here