Jr NTR – Ram Charan ప్రస్తుతం దేశం మొత్తం ఇప్పుడు #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు వస్తుందా , లేదా అనే అంశం పైన చర్చ నడుస్తుంది.ఈ ఆదివారం జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో ఈ సస్పెన్స్ కి తెరపడనుంది.అయితే ఈ ఆస్కార్ అవార్డ్స్ మొత్తం ఓటింగ్ పద్దతి ద్వారానే ఇస్తారు.ఎవరికైతే అత్యథిక ఓట్లు వస్తాయో,వాళ్ళే ఆస్కార్ అవార్డ్స్ విజేతలుగా నిలుస్తారు.ఆస్కార్ అవార్డు గెలుచుకునేందుకు #RRR మూవీ టీం గత పది రోజుల నుండి ఒక రేంజ్ ప్రొమోషన్స్ లో మునిగిపోయింది.

హాలీవుడ్ లో ఇప్పుడు ఏ మీడియా చూసిన రామ్ చరణ్ లేదా రాజమౌళినే కనిపిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కూడా నిన్న కొన్ని ఇంటర్నేషనల్ మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.అయితే వీళ్లిద్దరు ఎవరికీ వారు స్వయంగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారే కానీ, గతం లో లాగ కలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేశారు.అందుకు కారణం వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన విబేధాలే అని తెలుస్తుంది.

అమెరికా కి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ని ఇప్పటి వరకు కలవకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.అమెరికా లో అత్యంత పాపులర్ షో ‘ET now’ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ ఇంటర్వ్యూస్ ఇచ్చారు.కానీ కలిసి మాత్రం ఇవ్వలేదు,ఎవరికీ వారు ఇచ్చుకున్నారు.వీళ్లిద్దరు ఒకే లొకేషన్ లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు కలిసి ఇంటర్వ్యూ ఇవ్వలేదు అనేది ఇప్పుడు చర్చ.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కూడా ఒకరి గురించి ఒకరు ఈ ఇంటర్వ్యూస్ లో ప్రస్తావించుకోవడం తగ్గించేశారు. ఇలా వీళ్ళిద్దరిలో సడన్ గా ఏర్పడిన ఈ మార్పులను చూస్తూ ఉంటే HCA అవార్డ్స్ వీళ్ళ మధ్య బాగా దూరం పెంచేసింది తెలుస్తుంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈ ఆదివారం రోజు ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం. కనీసం ఇక్కడైనా కలిసి ఉంటారా, లేదా ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటారా అనేది చూడాలి.
