JR NTR : ఆర్ఆర్ఆర్ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి అవార్డుల పంట పండించే వరకు ప్రతి అడుగు గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండేళ్ల పాటు అంత ఆసక్తికరంగా ఎంతో ఓపికతో ప్రేక్షకులు ఎదురుచూసిన సినిమా అంటే ఇదే. మూవీ రిలీజ్ తర్వాత వారి ఎదురుచూపులు ఫలించాయి. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం సృష్టించిన రికార్డులు, ప్రపంచ వ్యాప్త ప్రశంసలు, అంతర్జాతీయ పురస్కారాలు, ఎంత అంటే చివరకు ఆస్కార్ అవార్డు గెలిచే వరకు ఈ చిత్ర ప్రభంజనం సాగింది.
ఈ సినిమాలో వావ్.. ఆ సీన్ చాలా బాగుందే అని చెప్పుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు చాలా సన్నివేశాలున్నాయి. వాటిన్నింటిలో కచ్చితంగా ది బెస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోమని ఎవరిని అడిగినా అందరు చెప్పే సమాధానం ఒకటే.. పులితో కొమురం భీమ్ ఫైట్ సీక్వెన్స్ అని. అడవిలో పులిని వెంబడించడం, పులిని బంధించడం.. ఈ సీన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమాలో పులి ముఖంలో ముఖం పెట్టి తారక్ చూసే ఒక షాట్ ఉంటుంది. ఆ సీన్ లో పులి కంటే తారక్ గంభీరంగా కనిపిస్తాడు. అంత అద్భుతంగా నటించాడు మరి మన కొమురంభీం.
తాజాగా ఆ సీక్వెన్స్ గురించి, షూటింగ్ సమయంలో జరిగిన సంఘటల్ని గురించి ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ఆ సీన్ కోసం ఎన్టీఆర్ పడిన కష్టం.. ఆయన డెడికేషన్, నటన గురించి తన మాటలో చెప్పారు. “ఆ మూవీలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్లో ఆయన మొదట నక్కను, తోడేలును ఆ తర్వాత పులిని వెంబడించాలి. దానికి తగినట్లుగా ఏ దారిలో పరిగెత్తాలో ఎన్టీఆర్‌కు మేము ముందే చెప్పాము. అప్పుడే మా కష్టాలు మొదలయ్యాయి యాక్షన్ అని చెప్పగానే తారక్ చాలా వేగంగా పరిగెత్తేవారు. అతని వేగం వల్ల ఆ సీన్‌ను కెమెరాలో క్యాప్చర్ చేయడం చాలా కష్టమైంది.”
“మొదట ఆయన అంత వేగంగా ఎలా పరిగెత్తగలుగుతున్నారు అని మాకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని ఎన్టీఆర్‌ను అడిగిన తర్వాత మాకు సమాధానం దొరికింది. ఎన్టీఆర్ నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని దాని కారణంగానే అంత వేగంగా పరిగెడుతున్నారని తెలిసింది. అయితే చేసేది ఏమిలేక అతని వేగానికి సరిపోయేలా మా ఏర్పాట్లు మేము చేసుకున్నాం” అంటూ అప్పటి విశేషాలు చెప్పుకొచ్చారు సెంథిల్. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ తమ హీరో నటనకు ఎవరూ రారి సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా మన తారక్ అన్న.. యాక్టింగ్ వేరే లెవల్ భయ్యా అంటూ ప్రశంసలతో మరోసారి ఎన్టీర్ ను పొగిడేస్తున్నారు.