Devara : కొంపతీసి ఎన్టీఆర్ కి కూడా అలాగే జరుగుతుందా?.. ఆందోళనలో తారక్ ఫ్యాన్స్!

- Advertisement -

Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తారక్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది. అప్పటి వరకు పూర్తయ్యేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ ను మేకర్స్ విడుదల చేశారు.  సముద్రం కాన్సెప్ట్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా వస్తుందని చిత్ర బృందం ముందే ప్రకటించింది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

రూ.120 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ఎన్టీఆర్ అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి. అయితే అప్డేట్ అప్డేట్ కు హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను చూస్తుంటే ఎందుకో తారక్ ఫ్యాన్స్ లో చిన్న భయం మొదలైంది. అదేంటంటే?

టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి విషంలో ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. జక్కన్న దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత తీసే కొత్త మూవీ దాదాపుగా ఫ్లాప్ అవుతుందని. ఇప్పటికే ప్రభాస్ (బాహుబలి), నాని (ఈగ) విషయంలో ఇదే జరిగింది. ఇక ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించిన రామ్ చరణ్ విషయంలోనూ అలాగే జరిగింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ చిరంజీవితో కలిసి ఆచార్యలో నటించారు. ఆ సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. దీంతో ఈ సెంటిమెంట్ కు మరింత బలం చేకూరింది.

దీంతో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు దేవర కూడా మిగతా హీరోల సినిమాల్లోలాగే ఫ్లాప్ అవుతుందా ఏంటని భయపడుతున్నారు. అలా జరగకుండా చూడాలని డైరెక్టర్ కొరటాల శివను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. అయితే ఫ్యాన్స్ ఇంతలా ఆయణ్ని రిక్వెస్ట్ చేయడానికీ ఓ కారణముంది. ఆచార్య విషయంలో కొరటాల ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయమూ తెలిసిందే. ఇలాంటి రిజల్ట్ దేవర విషయంలో రిపీట్ కావొద్దని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే జక్కన్న తన హీరోను ఓ రేంజ్ లో చూపిస్తారు. ఆ తర్వాత ఆయా నటుల తర్వాత సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచేసుకుంటారు. ఇక వాటిని అందుకోలేక ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అయితే దేవర విషయంలో తారక్ అయినా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో, కొరటాలకు ఆచార్య తర్వాత దేవర మూవీ కమ్ బ్యాక్ అవుతుందో లేదో తెలియాలంటే అక్టోబర్ 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here