Chiranjeevi విశ్వంభర సినిమాకు శేఖర్ మాస్టర్ కాదా.. వేరే కొరియోగ్రాఫరా.. న‌మ్మ‌లేక‌పోతున్నాం!

- Advertisement -

Chiranjeevi యంగ్ స్టార్ హీరోల కంటే మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ తో సినిమాలు తీస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. రీ ఎంట్రీ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే చాలా సినిమాలతో మెప్పించాడు. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూల్స్ చేశారు. చిరంజీవి, త్రిషతో పాటు మరికొందరు నటీనటులు ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజువల్ వండర్ గా రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమా కోసం పలువురు స్టార్ యాక్టర్స్, టెక్నీషియన్స్ ని కూడా తీసుకుంటున్నారు. అందుకే సినిమాలోని కొన్ని ముఖ్యమైన పాటలకు కొరియోగ్రాఫర్లు విజయ్ బిన్ని,  శోభిని తీసుకున్నారు. వీరిద్దరూ ఇప్పటికే రెండు పాటలను కంపోజ్ చేశారు. వీటి షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ల ఎంపికపై చర్చ తెరపైకి వచ్చింది. గత రెండు సినిమాల్లో మొత్తం పాటలను శేఖర్ మాస్టర్‌కి అందించాడు. అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కోసం హ్యాండ్ ఇచ్చాడు. అందుకే మరికొందరు కొరియోగ్రాఫర్లను తీసుకున్నట్లు తెలిసింది. అయితే దర్శకుడు మల్లిడి వశిష్ట కోరిక మేరకు శేఖర్‌ను కాదని ఇతర కొరియోగ్రాఫర్‌లను తీసుకున్నట్లు సమాచారం. ఇదే హాట్ టాపిక్‌గా మారుతోంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి-వశిష్టల ‘విశ్వంభర’ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక కాగా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కూడా కేటాయించిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here