ఈ సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ Chiranjeevi .. వీరసింహారెడ్డి మూవీతో నందమూరి బాలకృష్ణ దిగారు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదలై థియేటర్ల వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఇక వసూళ్లలోనూ ఈ రెండు సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పటి వరకు వీరసింహారెడ్డి 119 కోట్ల వసూళ్లు రాబట్టగా.. వాల్తేరు వీరయ్య రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
అయితే సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే ఆ మూవీలో నటించిన హీరో.. చిత్ర దర్శకుడికి కృతజ్ఞతగా గిఫ్ట్ ఇవ్వడం ఇటీవల టాలీవుడ్లో వస్తోన్న ట్రెండ్. అయితే దీనికి భిన్నంగా.. ఈసారి మెగాస్టార్ చిరంజీవి.. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఓ ఖరీదైన బహుమానం ఇచ్చారట. అదేంటి.. ఇస్తే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీకి ఇవ్వాలి గానీ.. గోపీచంద్‌కు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారా..? మరి ఎందుకో తెలియాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
వీరసింహారెడ్డి సినిమా విడుదలై వారం గడుస్తున్నా.. థియేటర్లో ఇంకా బాలయ్య మాస్ మేనియా తగ్గడం లేదు. అదేవిధంగా కలెక్షన్లలోనూ జోరు తగ్గినట్లు కనిపించడం లేదు. వేరే సినిమాలు ఏం లేకపోవడం.. బాలయ్య ఈ మూవీలో కొత్తగా.. స్టైలిష్‌గా కనిపించడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఘన విజయం సాధించిన ఈ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తనకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారంటూ గుర్తుచేసుకున్నారు.
“నాకు రవి తేజగారికి పోలికలుంటాయి అని అందరూ అంటుంటారు. కొన్ని షాట్స్ చేసేటప్పుడు రవితేజ అయితే నువ్వు నిలుచో నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి పోయేవారు. అలానే చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్ తెప్పించి గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పుడు చిరు.. ఇక నీ టైమ్ బాగుంటుందని అన్నారు. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు నాకు ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలేదు. వీరసింహారెడ్డికే తొలి సారి ఇచ్చారు.” అని గోపి చంద్ చెప్పుకొచ్చారు.