Pavitra Naresh : నరేష్ కి తన భార్య వల్ల ప్రాణాపాయం ఉందని కృష్ణ కి ముందే తెలుసా..! అందుకే అలా చేశాడా?

- Advertisement -

Pavitra Naresh : సీనియర్ హీరో నరేష్ నాల్గవ పెళ్లి వ్యవహారం ఎంత పెద్ద వివాదాలకు దారి తీసిందో మన అందరికీ తెలిసిందే.. గత ఏడాది నుండి ఈ వివాదానికి ఇంకా బ్రేక్ పడలేదు..మధ్యలో నరేష్ కాస్త సైలెంట్ అయ్యేలోపు ఈ వివాదం సర్దుమణిగింది అని అందరూ అనుకున్నారు..న్యూ ఇయర్ సందర్భం గా పవిత్ర లోకేష్ ని పెళ్లాడబోతున్నట్టు ఒక వీడియో ద్వారా అందరికీ తెలిపారు..ఆ వీడియో లో వాళ్లిద్దరూ లిప్ కిస్ చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

Pavitra Naresh
Pavitra Naresh

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి గురించి మీడియా ముందుకొచ్చి చేసిన కొన్ని కామెంట్స్ పెను దుమారమే రేపింది..తన మూడవ భార్య రమ్య వల్ల తనకి ప్రాణహాని ఉందని..చాలా రోజుల నుండి డబ్బుల కోసం నన్ను వేధిస్తోందని..డబ్బులు ఇవ్వకపోతే నన్ను చంపడానికి కూడా సిద్ధం అవుతుందని..అందుకోసం ఆమె ఒక గ్యాంగ్ కూడా సిద్ధం చేసిందంటూ మీడియా ముందుకి వచ్చి నరేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.

Pavitra Naresh Marriage

సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన నరేష్ చేసిన ఈ కామెంట్స్ పైనే చర్చ సాగుతుంది.. అయితే దీని గురించి మరొక కథనం సోషల్ మీడియా లో ఈరోజు ప్రచారమైంది.. అదేమిటి అంటే విజయ నిర్మల గారు చనిపోయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ బాధ్యతలు మొత్తం నరేష్ చూసుకునేవాడట.. మొదటి నుండి కృష్ణ తో పాటుగా ఉంటూ వచ్చాడు నరేష్.. ఆయనతో పాటు రమ్య రఘుపతి కూడా ఉండేది.

- Advertisement -
Krishna naresh

అయితే కృష్ణ కి మొదటి నుండి రమ్య రఘుపతి తీరు అసలు నచ్చేది కాదట.. ఎప్పుడూ డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఉండేది కాదట.. ఆమె గురించి అన్నీ తెలిసే ఆస్తి పంపకాలు నరేష్ – రమ్య దంపతులకు కలిపి కాకుండా కేవలం నరేష్ పేరు మీదనే రాసాడట.. విజయ నిర్మల మాత్రం బ్రతికి ఉన్నప్పుడు ఆమె సంపాదించిన ఆస్తులను ఇద్దరికీ కలిపి రాసిందట.. ఇప్పుడు అది మొత్తం తనపరం చేసుకునేందుకే రమ్య రఘుపతి కుట్రలు చేస్తుందంటూ నరేష్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

Pavitra Naresh
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here