Waltair Veerayya సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ ను షేక్ చేశారు. బాబీ డైరెక్షన్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలైన రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ లోనూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ కొందరు డైరెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ ఆచార్య దర్శకుడు కొరటాల శివను ఉద్దేశించేనా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇంతకీ చిరు వార్నింగ్ ఎందుకు ఇచ్చారు.
‘‘సినిమాలో అదనంగా సీన్స్ ఉంటే, ఆ పేపర్‌లను చింపేసి పారేయమని చెప్పేవాడిని. అనవసరంగా సీన్లు తీసి, నిర్మాతల డబ్బు, సమయాన్ని బుట్టదాఖలు చేయొద్దని చెప్పా. ఇలా చెబితే వినేవాళ్లు ఇప్పుడు తగ్గిపోయారు. ‘అరగంట సినిమా ఎడిటింగ్ రూమ్‌లో పక్కన పడేశాం’ అనే మాటలు వింటూనే ఉన్నాం. మా సినిమా ఏడున్నర నిమిషాలు.. మహా అయితే, పది నిమిషాలు పక్కన పెట్టాం. యాక్షన్ సన్నివేశాల్లో కాస్త ఎక్కువ తీశాం తప్ప, నిర్మాతలకు నయా పైసా వృథా కాలేదు’’
‘‘నేను అనే మాటలకు చిన్నా, పెద్ద దర్శకులు హర్ట్ అవుతారేమో, ‘సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ ఇవ్వడం కాదు.. నిర్మాతలకు చెప్పిన బడ్జెట్‌లో పూర్తి చేసి ఇవ్వాలి. అదే మొదటి సక్సెస్. కొత్త టెక్నాలజీ వాడి పనితనం చూపించే కంటే, కథను నమ్మి సాధారణ కెమెరాతోనూ గొప్ప సినిమా తీయాలి. ఏదైనా అవసరం మేరకు తీసుకోవాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే, బాధ్యత తీసుకునేవాళ్లు, అది గుర్తించాల్సిన వాళ్లు దర్శకులు మాత్రమే. ప్రతి వాళ్లు ఆలోచించాలి. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడటం లేదు. దీన్ని మీడియా వేరే వాళ్లకు, వాటికి ఆపాదించవచ్చు. సత్తా.’’ అని చిరంజీవి అన్నారు.
అయితే చిరంజీవి ఈ మాటలు ఆచార్య డైరెక్టర్ కొరటాల శివను ఉద్దేశించే అన్నారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది తాను కొరటాల శివను టార్గెట్ చేస్తున్నానని అంటున్నారని.. దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు చిరు. కొరటాలను నేను టార్గెట్ చేయలేదు. ఆయనపై ఎలాంటి కామెంట్స్ చేయలేదని మరోసారి క్లారిటీ ఇస్తున్నాను అని వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సక్సెస్ మీట్ లోనూ తాను ఒకరిని ఉద్దేశించి చేయడం లేదని చెప్పుకొచ్చారు.