Catherine Tresa : వంగి వంగి అందాలు చూపిస్తూ కేథరిన్ రెచ్చగొట్టే పోజులు

- Advertisement -

Catherine Tresa .. ఈ భామ చమ్మక్ చల్లో అనే సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఆ సినిమాతో ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​తో కలిసి నటించిన ఇద్దరమ్మాయిలు సినిమాలో ఈ భామ పాత్రను చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ మూవీలో కేథరిన్ అందం, అభినయం చూసి మనసు పారేసుకున్నారు. ఇద్దరమ్మాయిలు చిత్రం తర్వాత కేథరీన్​కు అవకాశాలు వరుస కట్టాయి. కానీ అంతగా గుర్తింపు మాత్రం తీసుకురాలేదు. ఇక అల్లు అర్జున్​తోనే మరోసారి సరైనోడులో జత కట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఎమ్మెల్యేగా నటించి అందరి మన్ననలు అందుకుంది. కుర్రాళ్లు ఇప్పటికీ ఈ భామను చూసి యూ ఆర్ మై ఎమ్మెల్యే అని పాడుకుంటూ ఉంటారు.

Catherine Tresa
Catherine Tresa

టాలీవుడ్​లో అంతగా అవకాశాలు రాకపోవడంతో కేథరిన్ తమిళ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం అడుగుపెట్టింది. అక్కడ ఈ భామకు మంచి అవకాశాలే వచ్చాయి. ఫ్లాపులు ఎదురైనా.. కమర్షియల్ సకెస్స్ కూడా అందుకుంది. మళ్లీ బ్యాక్ టూ టాలీవుడ్​కు వచ్చి ఇక్కడ అవకాశాలు అందుకుంటోంది. మెయిన్ హీరోయిన్​గానే కాకుండా సెకండ్ హీరోయిన్​గా.. హీరోకు స్నేహితురాలిగా కూడా నటించింది. లేటెస్ట్​గా మాచర్ల నియోజకవర్గం, బింబిసార సినిమాలతో తన ఖాతాలో హిట్​ సినిమాలను నమోదు చేసుకుంది.

Catherine Tresa photos
Catherine

ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయినా.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ బ్యూటీ చాలా ఫేమస్. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఘాటు పోజులతో మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు వలపు వల వేస్తూ ఉంటుంది. ఇక అందాల ఆరబోతలో ఈ భామ బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. బికినీలోనూ ఆ భామ తన హాట్​నెస్​తో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

- Advertisement -
Catherine Tresa Stills

తాజాగా కేథరీన్ లైట్ బ్లూ కలర్ ఔట్​ఫిట్​లో మెరిసింది. థైస్ కనిపించేలా షాట్.. క్లీవేజ్ షో చేసేలా ఉన్న టాప్​తో అదరగొట్టింది. సోఫాలో కూర్చొని వంగి వంగి తన ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది. మెస్మరైజింగ్ స్మైల్​తో మాయ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు కేథరీన్​పై మనసు పారేసుకుంటున్నారు. యూ ఆర్ మై ఎమ్మెల్యే అని మళ్లీ మళ్లీ పాడుకుంటున్నారు. హాట్ ఎమోజీ, ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here