Casting Couch : జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచ్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్!

- Advertisement -

Casting Couch : బుల్లితెర మీద సంచలనాత్మక షోగా అశేష ప్రేక్షకాభిమానం పొందిన ‘జబర్దస్త్’ ద్వారా ఎంతమంది టాలెంటెడ్ కమెడియన్లు ఇండస్ట్రీ కి వచ్చారో మన అందరికీ తెలిసిందే. కొంతమంది అయితే హీరోలు కూడా అయిపోయారు. ప్రేక్షకులకు ఈ షో ఒక అలవాటుగా మారింది. ప్రతీ రోజు గురువారం , శుక్రవారం వచ్చిందంటే చాలు,ఎన్ని పనులు ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టి ఈ షో చూసేందుకు టీవీల ముందు కూర్చుంటారు జనాలు.

Casting Couch
Casting Couch

అలాంటి షో కి ఈమధ్య కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు వారానికి 9 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు మూడు రేటింగ్స్ కి మించి రావడం లేదు. కారణం కామెడీ సరిగా లేకపోవడం వల్లే, మధ్యలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి టాప్ మోస్ట్ కమెడియన్స్ అందరూ ఈ షో ని మానేయడం వల్ల రేటింగ్స్ పై బాగా ఎఫెక్ట్ పడింది.

Jabardasth

ఇదంతా పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎలా అయితే ఉందో, ఈ ‘జబర్దస్త్’ షో లో కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య అలాగే ఉందట. లేడీస్ కంటెస్టెంట్స్ పై సీనియర్ కమెడియన్స్ ఆఫ్ సెట్ లో ‘సాయంత్రం రూమ్ కి వస్తావా’ అని అడుగుతున్నారట. ప్రతీ రోజు ఈ వేధింపులు తట్టుకోలేక జబర్దస్త్ నిర్వాహకులకు వెళ్లి కంప్లైంట్ చేశారట.

- Advertisement -

వాళ్ళు కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మాట ఇచ్చి, ఆ సీనియర్ కమెడియన్స్ ని మందలించే ప్రయత్నం చెయ్యగా, వాళ్ళు ‘జబర్దస్త్ నుండి నన్ను పీకేస్తే పీకెయ్.. ఏమి నష్టం లేదు’ అని చాలా పొగరుగా సమాధానం చెప్తున్నారట. ఒకప్పుడు అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగే ఈ కమెడియన్స్, ఇప్పుడు పీకేస్తే పీకెయ్ అనే రేంజ్ కి వచ్చారంటే ఈ షో ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here