Pawan Kalyan : రాత్రంతా రూమ్ లో ఉండమన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పిన పవన్ కల్యాణ్ హీరోయిన్ అదితి..

- Advertisement -

Pawan Kalyan : తాజాగా సీనియర్ హీరోయిన్.. తాను పాల్గొన్న ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘తమ్ముడు’ ఫేమ్ అదితి గోవిత్రికర్. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్ భామ అదితి గోవిత్రికర్. ఆ సినిమాలో తన పాత్ర గురించి ఎక్కువమంది ప్రేక్షకులకు గుర్తులేకపోయినా.. ‘వయ్యారీ భామ నీ హంస నడక’ అంటూ సాగే తన పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులందరికీ గుర్తుంది.

Pawan Kalyan
Pawan Kalyan

ఇక ఈ హీరోయిన్.. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ‘‘ఒక పెద్ద సినిమా షూటింగ్ కోసం నేను సౌత్ ఆఫ్రికా వెళ్లాను. ఆ సమయంలో ఆ వ్యక్తి అనవసరంగా హింట్స్ ఇస్తున్నాడని నేను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే నేను ఎక్కువగా మాట్లాడకుండా తన మొహం మీదే నవ్వి ‘నీకైమైనా పిచ్చా?’ అని అడిగి వెళ్లిపోయాను. కానీ అలా అనడం వల్ల తన ఇగో హర్ట్ అయ్యింది. ఆ తరువాతి రోజే నా టీమ్‌ను, నన్ను ప్యాకప్ చేసుకొని చెప్పి ముంబాయ్ పంపించేశారు. ఆ సమయంలో అసలు ఏం జరిగిందో నేను అర్థం చేసుకోలేకపోయాను’’ అని బయటపెట్టింది అదితి.

అలాగే‘‘మేము ఒకసారి హోటల్‌లో కలిశాము. ఆ రోజుల్లో చాలా మీటింగ్స్ హోటల్స్‌లో జరిగేవి. అది కామన్. అదే సందర్భంలో నేను నా తండ్రితో చాలా క్లోజ్‌గా ఉంటాను అని ఆ వ్యక్తితో చెప్పాను. అయితే మంచిదే. ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి రేపు పొద్దున వస్తానని చెప్పు అన్నాడు. నాకు ఒక్కసారిగా కన్నీళ్లు ఆగలేదు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను. ఇలాంటి విషయాలను మనకు వెంటనే అర్థం కావు. తర్వాత ఆలోచిస్తే అనిపించింది.. ఇది ఇంకా సాయంత్రమే కదా, ఆ వ్యక్తితో నేను ఉదయం వరకు ఉండి ఏం చేయాలి అని. ఆ తర్వాత అతడు అన్న మాటల వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థమయ్యింది’’ అని వివరించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here