Akineni Nagarjuna : ఇద్దరి హీరోయిన్ల కెరీర్ ని సర్వనాశనం చేసిన అక్కినేని నాగార్జున..పాపం ఇప్పటికి కోలుకోలేకున్నారుగా!

- Advertisement -

Akineni Nagarjuna : అక్కినేని నాగార్జున తో ఒక సినిమాలో నటించే అవకాశం దొరికితే ఏ హీరోయిన్ అయినా ఒక అదృష్టం లాగ భావిస్తారు. ఎందుకంటే అధికశాతం మంది హీరోయిన్లు తమ టీనేజ్ లో అక్కినేని నాగార్జున ని తమ ఫేవరెట్ హీరో గా అనుకొని ఉంటారు. ఇలాంటి భర్త దొరకాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావలి అని ఊహించుకుంటూ ఉంటారు.

చాలా మంది హీరోయిన్లు ఓపెన్ గానే అక్కినేని నాగార్జున మా ఫేవరెట్ హీరో అని పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అక్కినేని నాగార్జున తో కలిసి నటించిన వాళ్ళు నేడు సౌత్ ఇండియా లోనే పెద్ద సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్నారు. ఉదాహరణకి అనుష్కనే తీసుకుందాం. యోగా టీచర్ లో కొనసాగుతున్న ఆమెని ‘సూపర్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి తీసుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఆమె రేంజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అలా అనుష్క లాంటి ఎంతో మంది హీరోయిన్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసి స్టార్స్ ని చేసిన నాగార్జున, ఇద్దరి హీరోయిన్ల కెరీర్ ని మాత్రం సర్వనాశనం చేసాడని ఇండస్ట్రీ లో ఒక వార్త తెగ ప్రచారం అవుతుంది. అందులోఒక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం , హిందీ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడైతే ‘మన్మథుడు 2’ చిత్రం చేసిందో, అప్పటి నుండి ఆమెకి బ్యాడ్ టైం స్టార్ అయ్యింది. ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో రకుల్ వైపు చూడడం కూడా మానేశారు దర్శక నిర్మాతలు.

- Advertisement -

ఈమె తర్వాత ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయిన హీరోయిన్ పూనమ్ బజ్వా. అప్పట్లో యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ పలు హిట్స్ ని అందుకున్న పూనమ్ బజ్వా, ఎప్పుడైతే నాగార్జున తో ‘బాస్’ అనే చిత్రంలో నటించిందో అప్పటి నుండి ఆమెకి కెరీర్ లేకుండా పోయింది. రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలు చూసి ఇంత అందం గా ఉండే అమ్మాయికి సినిమాల్లో అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అలా ఈ ఇద్దరి హీరోయిన్ల కెరీర్స్ నాగార్జున సినిమాల వల్లే నాశనం అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here