‘తొలిప్రేమ’ సినిమా సంగీత దర్శకుడు ‘దేవ’ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో.. ఏమి చేసున్నాడో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

- Advertisement -

మన టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ కాలం నుండి నేటి తరం వరకు ఎక్కువ క్లాసిక్స్ ఉన్నది ఈ జానర్ లోనే. అలాంటి ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్న సినిమా ‘తొలిప్రేమ’. పవన్ కళ్యాణ్ మరియు కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

తొలిప్రేమ
తొలిప్రేమ

అప్పటి వరకు కేవలం చిరంజీవి తమ్ముడిగా కొనసాగిన పవన్ కళ్యాణ్ , ఈ సినిమాతో యూత్ ఐకాన్ గా, స్టార్ హీరో గా మారిపోయాడు. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కరుణాకరన్ టేకింగ్ , పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన తో పాటుగా , తమిళ సంగీత దర్శకుడు దేవా అందించిన అద్భుతమైన మ్యూజిక్ కూడా ఒక కారణం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

tholi prema

ముఖ్యంగా ఈ చిత్రం లోని పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే టైటానిక్ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని విన్న ఫీలింగ్ కలుగుతుంది. రీసెంట్ గా థియేటర్స్ లో మరోసారి రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాని మరోసారి వెండితెర మీద చూసిన ప్రతీ ఒక్క బ్యాక్ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అలాంటి సంగీతం అందించిన దేవా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో ఒకసారి చూద్దాము.

- Advertisement -
pawan kalyan

‘దేవా’ తమిళనాడు లో సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అక్కడి స్టార్ హీరోలందరితో ఈయన సినిమాలు చేసి ఉన్నాడు. చిన్నతనం నుండి సంగీతమే ప్రపంచం గా బ్రతికిన ఈయన, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ కి మంచి స్నేహితుడు. టీనేజ్ లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో స్టేజి పెర్ఫార్మన్స్ ఇచ్చి ఉన్నారు. 1986 వ సంవత్సరం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దేవా, సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎన్నో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించాడు. బాషా మరియు అన్నామలై సినిమాలకు సంగీతం అందించింది దేవా నే, అలా చెప్పుకుంటూ పోతే తమిళనాడు ని ఒక ఊపేసిన పాటలన్నీ 90 శాతం దేవా అందించినవే.

DIrector Deva

తెలుగు లో ఈయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన మాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ కి అందించాడు. దేవా కొడుకు శ్రీకాంత్ దేవా కూడా ప్రస్తుతం పెద్ద తమిళ నాడు లో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక ఆయన అక్క కొడుకు జై కూడా కోలీవుడ్ లో టాప్ మోస్ట్ యంగ్ హీరోలలో ఒక్కడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే తనతో సరిసమానమైన స్థాయి మరియు వయస్సు ఉన్న ఇళయరాజా మరియు కీరవాణి వంటి వారు ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటే, ఇలా దేవా మాత్రం ఖాళీగా ఉండడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు, కొడుకు రాణిస్తున్నాడు కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. దీనితో ఆర్థికంగా కూడా గొప్ప స్థానం లో లేనట్టు తెలుస్తుంది. దేవా పరిస్థితి చూసి ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here