Gowri Munjal : ‘బన్నీ’ మూవీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. చూస్తే షాక్ అవుతారు



Gowri Munjal : ఆరోజుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి మూడు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన వాళ్లకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, కానీ అగ్ర కథానాయికలుగా మాత్రం నిలబడలేకపోయారు. వారిలో మనం గౌరీ ముంజల్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి.అల్లు అర్జున్ మూడవ చిత్రం బన్నీ లో హీరోయిన్ గా నటించిన ఈమె తొలి సినిమాతోనే ‘ఏముందిరా బాబు’ అని కుర్రకారులతో అనిపించేలా చేసింది.

Gowri Munjal
Gowri Munjal

ఈ సినిమా తర్వాత ఆమె వేరే లెవెల్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు, అవకాశాలు కూడా బాగానే వచ్చాయి కానీ పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం మాత్రం పొందలేదు. బన్నీ చిత్రం తర్వాత ఆమె శ్రీకాంత్ – వేణు తొట్టెంపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీకృష్ణ 2006’ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఆరోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాతైనా ఆమె దశ తిరిగి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు.

Gowri Munjal Movies

కానీ మళ్ళీ ఆమెకి చిన్న హీరోల సినిమాల్లోనే ఛాన్స్ లు వచ్చాయి, ‘శ్రీకృష్ణ 2006’ తర్వాత ఆమె అల్లరి నరేష్ తో కలిసి ‘గోపి గోడమీద పిల్లి’ అనే సినిమా చేసింది. ఇది కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ గానే నిలిచింది కానీ ఆమె రేంజ్ ఏమాత్రం మారలేదు, ఇక ఆ తర్వాత పలు తమిళ మరియు కన్నడ బాషలలో నటించింది కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

ఇలా తెలుగు లో వరుస సక్సెస్ లు ఉన్నప్పటికీ కూడా అవకాశాలు దక్కించుకోలేకపోయిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరిగా చేరిపోయింది గౌరీ ముంజల్.. ఈ చివరగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘హోరి’. కన్నడ లో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది, ఇక అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి వైరల్ గా మారాయి. ఆ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Gowri Munjal Photos
Gowri Munjal Latest Photos
Gowri-Munjal saree photos