రతిక పల్లవి ప్రశాంత్ ల పరువు తీసిన బిగ్ బాస్.. వాళ్ల రొమాంటిక్ వీడియో బయటపెట్టాడుగా..ఏ బిగ్ బాస్ సీజన్ ప్రారంభమయినా కూడా కొన్నిరోజుల్లోనే అందులో ఒక ప్రేమ కహానీ మొదలయిపోతుంది. కానీ ఈసారి అసలు ఆ ప్రేమ కహానీ ఏ ఇద్దరి మధ్య జరుగుతుంది అనే విషయం ఇంకా ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు. బిగ్ బాస్ ప్రారంభమయిన మొదటిరోజు నుండే పల్లవి ప్రశాంత్‌కు రతిక అంటే ఇష్టం ఏర్పడినట్టుగా అనిపించింది.

బిగ్ బాస్
బిగ్ బాస్

రతిక కూడా ప్రశాంత్‌తో చనువుగా ఉండడం మొదలుపెట్టింది. కానీ నామినేషన్స్‌లో రతిక అన్న ఒక్క మాటతో వారిద్దరి మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత రతిక, ప్రశాంత్ సరదాగా మాట్లాడుకున్నారు. ఎక్కువమంది ప్రేక్షకులు చూడని ఆ వీడియోను.. బిగ్ బాస్ బజ్‌లో లీక్ చేశారు. బెడ్ రూమ్‌లో రతిక పడుకొని ఉండగా.. గ్లాస్‌కు అటువైపుగా ప్రశాంత్ కూర్చొని ఉన్నాడు.

‘‘కొంచెం ముందుకు రా’’ అని ప్రశాంత్ అడగడంతో ఈ బిగ్ బాస్ బజ్ ప్రోమో మొదలయ్యింది. ‘‘డ్యాన్స్ రాదని బాగానే డ్యాన్స్ చేశావు’’ అంటూ రతిక.. ప్రశాంత్‌ను పొగిడింది. దానికి ప్రశాంత్ సరదాగా డిస్కో డ్యాన్సర్ అంటూ పాటపాడాడు. ఫ్లోర్ మూమెంట్ అంటూ కామెడీ చేశాడు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు, సరదాగా చేతులతో ఆడుకున్నారు. ఇదంతా చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు.. మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని అనుకోవడం మొదలుపెట్టారు.