Rathika : జాక్ పాట్ కొట్టిన బిగ్ బాస్ రతిక.. అసలు నీకెలా ఛాన్స్ ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

- Advertisement -

Rathika : ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది నడిచినన్ని రోజులు తెరకు అతుక్కుపోయి చూసే ప్రేక్షకులు కోట్లాది మందే ఉన్నారు. మన తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షోగా బిగ్ బాస్ కొనసాగుతోంది. అలా ఈ బిగ్ బాస్ ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో ర‌తికా రోజ్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అందంతో పాటు మంచి మంచి పాటలను పాడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి తింగరి తనాన్ని బట్టబయలు చేసుకుంది. ఆమె చేసే పనులతో నెటిజన్లలో విపరీతమైన నెగెటివిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై ఆమె వ్యవహరించిన తీరు పట్ల బయట ఆమెపై భారీగా విమర్శలు వచ్చాయి.

కానీ మళ్లీ తిరిగి హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి కాస్తయినా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందని అంతా భావించారు. అయితే రీ ఎంట్రీ లోనూ ఆమె అదే నెగటివిటీతో బయటకు వచ్చింది. ఇక ఈ బ్యూటీ గతంలో పలు తెలుగు సినిమాల్లో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. కానీ బిగ్‌బాస్ తర్వాత ర‌తిక‌కు అసలైన గుర్తింపు వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతికకు ప‌లు చిత్రాల్లో మెయిన్ లీడ్ గా నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల్లో ర‌తిక‌కి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

- Advertisement -
rathika rose
rathika rose

అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా హౌస్‌లో ఇత‌ర కంటెస్టెంట్లతో కలవడం లేదు ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు ఎంతో కష్టపడుతుంది. తనకు సినిమాల్లో హీరోయిన్ గా కొందరు అవకాశం ఇచ్చారని… ముఖ్యంగా తమిళంలో పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో స్టార్ హీరో సరసన హీరోయిన్ గా అవకాశం వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. అయితే దాన్ని వాళ్ళు అధికారికంగా ప్రకటించిన తరువాతనే తాను కూడా రివీల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే బిగ్ బాస్ లో భారీ నెగెటివిటీ సంపాదించుకున్న రతిక ఒక్కసారిగా రెండు సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ అందుకుందంటూ వార్తలు వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here