Bigg Boss Telugu : శోభా శెట్టి ని కాపాడేందుకు ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్.. ఇవేమి చీప్ ట్రిక్స్ సామీ!

- Advertisement -

Bigg Boss Telugu : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 అత్యంత ప్రేక్షకాదరణ తో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో 5 మంది ఎలిమినేట్ అవ్వగా, మరో 5 మంది కొత్తగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ఈ వారం నామినేషన్స్ లో పాత కంటెస్టెంట్స్ తో పాటుగా కొత్త కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అమర్ దీప్, యావర్, నాయని పావని, శోభా శెట్టి, టేస్టీ తేజా, అశ్వినీ మరియు పూజా మూర్తి నామినేషన్స్ లోకి వచ్చారు. కొత్తవారిలో అర్జున్ , ఐశ్వర్య మరియు నాయని పావని తప్ప మిగిలిన ఇద్దరు ఇంకా తమ గేమ్ ని ప్రారంభించలేదు.

సోషల్ మీడియా లో జరుగుతున్న అనధికారిక వెబ్ సైట్ పోలింగ్స్ ని బట్టీ చూస్తే శోభా శెట్టి ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి. కచ్చితంగా ఆమెనే ఎలిమినేట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె సేవ్ అయ్యినట్టు తెలుస్తుంది. నాయని పావని హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అట.

- Advertisement -
Nayani Pavani

ఇదంతా స్టార్ మా ఛానల్ తమ సీరియల్ బ్యాచ్ ని కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే శోభా శెట్టి ని సేవ్ చేసారని, కొత్త కంటెస్టెంట్ అయిన నాయని పావని ని ఎలిమినేట్ చెయ్యడం అన్యాయం అని అంటున్నారు. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండే ఆమె అందరితో స్నేహపూర్వకంగా ఉందని, టాస్కుల విషయం లో చాలా చురుగ్గా పాల్గొనేది అని , అలాంటి అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here