Bigg Boss 6 Telugu : విన్నర్ రేవంత్‌.. కానీ ప్రైజ్ మనీ శ్రీహాన్‌కు.. సూపర్ ట్విస్ట్‌

- Advertisement -

Bigg Boss 6 Telugu : ‘బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-6’ ఎలాంటి అంచనాలు లేకుండా మామూలు కంటెస్టెంట్లతో ఈ సీజన్ ప్రారంభమైంది. చివరి వారం వరకు కూడా ఈ సీజన్‌పై ప్రేక్షకులకు అంతగా మంచి అభిప్రాయం లేదు. కానీ చివరి వారం ఎపిసోడ్స్‌ను మాత్రం వ్యూయర్స్ తెగ ఎంజాయ్ చేశారు. సీజన్‌ను మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్న కంటెస్టెట్లు ఈ సీజన్ విన్నర్ పక్కాగా రేవంత్‌ అవుతాడని ఫిక్స్ అయిపోయారు. ఆ దృష్టితోనే సీజన్ చూస్తూ వచ్చారు. కానీ లాస్ట్ వారంలో లెక్కలు తారుమారయ్యాయి.

రోహిత్, శ్రీహాన్‌లో మంచి పాపులారిటీ సంపాదించారు. రేవంత్‌కు దీటుగా పోటీనిచ్చారు. వీరిద్దరిలో ఒకరు ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో బిగ్‌బాస్ సీజన్-6 విజేతగా తెలుగు సినీ నేపథ్య గాయకుడు రేవంత్‌ నిలిచాడు. ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 

bigg boss 6 telugu  winner
bigg boss 6 telugu winner

ఈ సీజన్‌లో మొత్తం 21 మంది కంటెస్టెంట్‌లు పోటీ పడగా.. రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, కీర్తి భట్‌, రోహిత్‌లు టాప్‌-5కు చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్‌ ఫినాలెలో తొలుత రోహిత్‌, తర్వాత ఆదిరెడ్డి, మూడో వ్యక్తిగా కీర్తి ఎలిమినేట్‌ అయి హౌస్‌ నుంచి బయటకు వచ్చారు.  టైటిల్‌ పోరులో టాప్‌-2లో  శ్రీహాన్‌, రేవంత్‌ నిలిచారు. ఈ సందర్భంగా  గోల్డెన్‌బాక్స్‌తో హౌస్‌లోకి వచ్చిన నాగార్జున ఇద్దరికీ అదిరే ఆఫర్‌ ఇచ్చాడు. ప్రైజ్‌ మనీలో సగం మొత్తం తీసుకుని హౌస్‌ నుంచి వెళ్లిపోవచ్చని సూచించాడు. తొలుత ఇద్దరూ ససేమిరా అన్నారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.30లక్షలకు పెంచారు. అప్పుడు కూడా ఇద్దరూ అంగీకరించలేదు. చివరికి ఆ మొత్తాన్ని రూ.40లక్షలు చేయడంతో శ్రీహాన్‌ ఆ మొత్తం తీసుకున్నాడు. దీంతో రేవంత్‌   బిగ్‌బాస్‌-6 ట్రోఫీ, రూ.10లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రన్నర్‌గా నిలిచిన శ్రీహాన్‌ రూ.40లక్షలు గెలుచుకోవడం గమనార్హం.

- Advertisement -
Shrihan
Shrihan

ఇక ఆదివారం జరిగిన ఫినాలే ఎపిసోడ్‌ ఆద్యంతం అలరించింది. ఈ సీజన్‌లో ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిన హౌస్‌మేట్స్‌ అందరూ షోకు విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ వీక్షకులను అలరించాయి. ఇక ఇంటి నుంచి వెళ్లిపోయిన హౌస్‌మేట్స్‌లో అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారని ఫైనలిస్ట్‌లను అడగ్గా, మెరీనాకు బెస్ట్‌ చెఫ్‌, శ్రీ సత్యకు బెస్ట్‌ స్లీపింగ్‌ స్టార్‌, ఫైమాకు బెస్ట్‌ డ్యాన్సర్‌, రాజ్‌కు బెస్ట్‌ గేమర్‌, అర్జున్‌ కల్యాణ్‌కు బెస్ట్‌ లవర్‌ అవార్డులు ఇచ్చారు. అలనాటి నటి రాధ, యువ నటుడు నిఖిల్‌, మాస్‌ హీరో రవితేజ, అందాల భామ శ్రీలీల తదితరులు ఫినాలే ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-6 ఈ ఏడాది సెప్టెంబరు 4వ తేదీ నుంచి మొదలైంది. మొత్తం 105 రోజుల పాటు సీజన్‌ కొనసాగింది. ఈసారి కూడా అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు..వివిధ రంగాలకు చెందిన మొత్తం 21 మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో పాల్గొనడం విశేషం. అయితే, ఈసారి ఎలాంటి వైల్డ్‌ కార్డు ఎంట్రీలను అనుమతించలేదు. అలాగే ఏ కంటెస్టెంట్‌నూ సీక్రెట్‌ రూమ్‌లోనూ ఉంచలేదు.️

సీజన్‌-6లో పలువురు సినీ తారలు వేదికపై సందడి చేశారు. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌, సుధీర్‌బాబు, కృతిశెట్టి, అమల, శర్వానంద్‌, తమన్నా, రితికా సింగ్‌, రుక్సార్‌, శ్రద్ధాదాస్‌, సోనాల్‌ చౌహాన్‌, ప్రవీణ్ సత్తారు, రమ్య బెహర, శ్రావణ భార్గవి, శ్రీకృష్ణ, దేవిశ్రీ ప్రసాద్‌, అవికా గోర్‌, రష్మి, అంజలి, శ్రీరామ చంద్ర, హైపర్‌ ఆది, కార్తి, రజీషా విజయన్‌, సోహైల్‌, శివ బాలాజీ, రోల్‌రైడా, అడవి శేష్‌, మీనాక్షి చౌదరి, తదితరులు వేదికపైకి వచ్చి, హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com