Katrina Kaif : ఫెమినా మేగజైన్ కోసం బోల్డ్ లుక్స్​లో కత్రినా కైఫ్

- Advertisement -

Katrina Kaif.. అదేనండి మన మల్లీశ్వరి. బాలీవుడ్​లో సూపర్ స్టార్​డమ్ సంపాదించిన హీరోయిన్లలో కత్రినా ఒకరు. ఈ బ్యూటీ టాలీవుడ్​లోనూ ఒకప్పుడు మెరిసింది. వెంకటేశ్​తో కలిసి మల్లీశ్వరిలో యువరాణిగా అలరించింది. బాలకృష్ణతో కలిసి అల్లరి పిడుగు అనే మూవీలో ఆడిపాడింది. ఆ తర్వాత ఇక టాలీవుడ్​ వైపు తిరిగి చూడలేదు. బాలీవుడ్​లోనే పాగా వేసి ఇప్పుడు అక్కడ హై రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్​గా స్థిరపడింది.

Katrina Kaif
Katrina Kaif

కత్రినాను బీ టౌన్ ముద్దుగా క్యాట్ అని పిలుచుకుంటుంది. ముంబయిలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నాయికల్లో కత్రినా నంబర్ వన్. తన గ్లామర్, నటనతో మెప్పిస్తూ ఈ అమ్మడు ఇప్పటికీ తన ఫామ్ సాగిస్తోంది. ఇటీవలే ఫోన్ బూత్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది కత్రినా. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.

Katrina Kaif  Photos

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కే బ్యూటీ బై కత్రినా అంటూ వ్యాపారం మొదలుపెట్టింది. అంతేకాకుండా కత్రినా సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ హవా మామూలుగా లేదు. మిలియన్ల కొద్ది ఫాలోవర్లతో ఈ భామ ఇన్​స్టాగ్రామ్​లో దూసుకెళ్తోంది. ఈ బ్యూటీ ఫొటోషూట్లకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఎంత స్టైలిష్ డ్రెస్​లు వేసినా.. ఈ బ్యూటీ వల్గర్​గా అసలు కనిపించదు. ప్రతి ఔట్​ఫిట్ కత్రినా కోసమే డిజైన్ చేసినట్టు సూపర్​గా నప్పుతుంది ఈ భామకు.

- Advertisement -
Katrina Kaif  Stills

రీసెంట్​గా ఫెమినా కోసం మరోసారి తన హాట్ అండ్ క్రేజీ పోజులతో ఫొటోషూట్ చేసింది కత్రినా. బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్​తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూడు పదులు దాటినా ఈ బ్యూటీ అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గ్లామర్ ట్రీట్​తో ఈ బ్యూటీ ఇప్పటికీ కుర్రాళ్ల ఫేవరెట్​గా నిలిచిపోయింది. విక్కీ కౌశల్​ను పెళ్లాడిన ఈ భామ హాట్​నెస్​లో తనకు ఎవరూ సాటి రారంటూ బ్యూటీ ట్రీట్ ఇస్తోంది.

Katrina Kaif  Pics

సినిమాల సంగతి ఎలా ఉన్నా ఫ్యాషన్ మేగజైన్స్ కోసం హీరోయిన్ల ఫొటోషూట్స్ తీసుకొచ్చే మైలేజ్​ది వేరే లెక్క. ఈ లిస్టులో కత్రినా తర్వాతే ఎవరైనా. తన ప్రతి ఫొటోషూట్​లో ఈ బ్యూటీ తన గ్లామర్ డోస్​ను చూపిస్తుంది. హాట్​నెస్ ఓవర్ లోడ్ అనేలా పోజులిచ్చినా.. ఎక్కడా వల్గారిటీ లేకుండా జాగ్రత్త పడుతుంది కత్రినా. ఈ బ్యూటీ లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here