Upasana Konidela : తన తాత బయోపిక్ తెరకెక్కిస్తున్న ఉపాసన.. హీరోగా రామ్ చరణ్.. డైరెక్టర్ ఎవరంటే ?

- Advertisement -


Upasana Konidela : మెగా అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. మెగా కోడలు ఉపాసన ఇటీవల చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు అన్న సంగతి మనకు తెలిసిందే. ఉపాసన ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇటీవల ప్రతాప్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో ఆయన తాతగారి కెరీర్‌లో ఎదుగుదల గురించి రూపొందించిన “ది అపోలో స్టోరీ” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Upasana Konidela
Upasana Konidela

అనంతరం ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన తాత గురించి, ఆయన గొప్పతనం గురించి వివరించారు. తన తాత తన కుమార్తెలను ఎలా ప్రేరేపించారో ఆమె చెప్పింది. ప్రతి తండ్రి ఈ పుస్తకాన్ని చదవాలని సూచించింది. అలాగే ఇదే క్రమంలో బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారా..? అని మీడియా ప్రశ్నించగా.. భవిష్యత్తులో ఇది కచ్చితంగా జరగొచ్చు.

Upasana Konidela Ram CHaran

ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే రామ్ చరణ్ ఇందులో నటిస్తాడా? అని ప్రశ్నించగా, అది దర్శకుడి విజన్‌పై ఆధారపడి ఉంటుందని ఆమె సమాధానం దాటవేసింది. ఉపాసన తన తాత బయోపిక్‌ని అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఉపాసన తనకు సినిమాలపై ఆసక్తి లేదని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. తాతగారి బయోపిక్‌ని తానే డైరెక్ట్ చేస్తానని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here