BB Jodi : మెహబూబ్ పంట పండింది రోయ్.. శాండ్విచ్.. అప్పరప్పర తాండ్ర కామెంట్స్..

- Advertisement -

BB Jodi : స్టార్ మా చానల్లో ఇటీవల ప్రారంభమైన బీబీ జోడి అతికొద్ది కాలంలోనే సూపర్ సక్సెస్ ను అందుకుంది.. బిగ్ బాస్ కంటే మంచి రేటింగ్ సాధించిన ఢీ డాన్స్ షోని కూడా ఢీ కొట్టింది బిబి జోడి.. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్సే జోడిగా డాన్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ బీబీ జోడి కంటెస్టెంట్స్ లో మెహబూబ్ శ్రీ సత్య ఒక జోడి.. ఈ జంట ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తోంది.. ఈవారం ప్రసారమయ్యే బీబీ జోడి ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెహబూబ్ పర్ఫామెన్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు..

BB Jodi Mehaboob sri satya dance performance
BB Jodi Mehaboob sri satya dance performance

ఈ వారం బీబీ జోడిలో తీన్మార్ స్పెషల్.. బీబీ జోడి కి మరొక బిగ్బాస్ కంటెస్టెంట్ యాడ్ అవుతారు. ఇక ముగ్గురు కలిసి అవుట్ అండ్ అవుట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఈ వీక్.. వీళ్ళ పర్ఫామెన్స్ చూస్తుంటే ఈ వీక్ ఎపిసోడ్స్ అస్సలు మిస్ కాకూడదు అనిపిస్తుంది ఆ రేంజ్ లో ఉన్నాయి ఒక్కొక్కరి పర్ఫామెన్స్ ఇక బిగ్ బాస్ ఫేం మానస్, బిందు, స్వేత, అమర్ కూడా వచ్చారు. మొత్తానికి ఈ వారం ఎపిసోడ్స్ లో రచ్చ రచ్చే..

BB Jodi Mehaboob sri satya dance performance
BB Jodi Mehaboob sri satya dance performance

శ్రీ సత్య మెహబూబ్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరలేదు. ఇప్పటికే వీళ్లిద్దరికి కెమిస్ట్రీ అవుట్ అండ్ అవుట్ పెర్ఫార్మెన్స్ గా ఉంటే.. ఫుల్ మీల్స్ తో ఫుల్ హ్యాపీ చేస్తున్నారు ఈ జంట. ఇక మెహబూబ్ కి మరొక డాన్సింగ్ డాల్ తోడైతే ఎలా ఉంటుందో అలా కిర్రక్ పెర్ఫార్మెన్స్ చేశారు మెహబూబ్, శ్రీ సత్య, శ్వేత..

- Advertisement -
BB Jodi Mehaboob sri satya dance performance
BB Jodi Mehaboob sri satya dance performance

వీళ్ళ డాన్స్ చూసి కంటెస్టెంట్స్ ఆడియన్స్ తో పాటు జడ్జెస్ కూడా ఫిదా అయ్యారు. ఇక మెహబూబ్ పై సాండ్విచ్ డాన్స్ ఏంటి బాబు అంటూ తరుణ్ మాస్టర్ ఓ రేంజ్ లో పంచులు వేశారు. ఇక సదా కూడా స్టేజ్ అంతా హీటెక్కించారు అంటూ తెగ పొగిడేశారు. అంతేకాకుండా ఇద్దరి భామలతో మెహబూబ్ స్టేజ్ పై అందంగా ముద్దు ఇచ్చారు ఇద్దరు భామలు ఒకేసారి.. మెహబూబ్ కి శాండ్విచ్ కిస్, అప్పరప్పర తాండ్ర అంటూ ఛాన్స్ కొట్టేసావ్ పండగ చేసుకో అంటూ నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓ పక్క అందమైన భామలతో మరోపక్క ఒకేసారి ఇద్దరితో ముద్దు అదృష్టం అంటే నీది గురు.. మెహబూబ్ పంట పండింది రోయ్.. అంటూ హద్దులు మీరు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. ఈ వారం ప్రోమోతోనే ఆకట్టుకున్నారు బీబీ జోడి.. ఇప్పటికే ఈ ప్రోమో వన్ మిలియన్ వ్యూస్ ని అందుకుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here