నందమూరి Balakrishna .. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా తెలుగు తెరకు పరిచయమ్యారు. బాల్యం నుంచే సినిమాల్లో నటిస్తూ.. జానపద, పౌరాణిక, సాంఘిక, కమర్షియల్, మాస్, ఊరమాస్, కుటుంబ కథా చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నారు. ఫ్యాక్షన్ అనగానే తెలుగు ప్రేక్షకుడికి గుర్తొచ్చే మొదటి పేరు బాలయ్య.
ఇలా తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య తనని తాను నిరూపించుకున్నారు. ఇక బాలయ్య సినిమా వస్తోందంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ఇక ఇంట్లో పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అంతా బాలయ్య అభిమానులే. తన తండ్రి బాటలో నడుస్తూ.. ఎన్టీఆర్ వారసత్వాన్ని.. తెలుగు తెరపై నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు బాలయ్య.
ఇక నందమూరి బాలకృష్ణ ఎక్కువగా సినిమాలు చేసింది డైరెక్టర్ బి గోపాల్ తో. బాలయ్య- బి.గోపాల్ కాంబినేషన్ సూపర్ హిట్. వాళ్లిద్దరి కాంబోలో సినిమా అంటే బ్లాక్ బస్టరే. వీళ్లిద్దరు కలిసి తీసిని సినిమాల్లో సూపర్ హిట్ అనిపించుకున్న మూవీ ‘రౌడీ ఇన్స్పెక్టర్‘ ఒకటి.
ఆ రోజుల్లోనే మాస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆ చిత్రం నమోదు చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ఆ చిత్రీకరణకు రావడానికి బాలకృష్ణ ఓ కండిషన్ పెట్టారంటే నమ్ముతారా. అదేంటి బాలయ్య దర్శకుల హీరో కదా.. అలాంటి ఇబ్బందులేం పెట్టడంటారే అనుకుంటున్నారా? ఆ షరతు ఏంటో తెలిస్తే బాలకృష్ణ నటన మీద ఉన్న ప్యాషన్ ఏంటో తెలుస్తుంది. అది ఆ సినిమా హిట్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది కూడా.
పోలీసు నేపథ్య సినిమాల్లో ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే.. బాలయ్య నటన చూసి ప్రేక్షకులు అదుర్స్ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు.. జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలయ్య ఆ పాత్రలో లీనమైపోయారు. అలానే షూటింగ్ జరుగుతున్నన్నీ రోజులు పోలీసులానే ఫీలయ్యారు. అలా రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్ ఓ సందర్భంలో చెప్పారు.