Balakrishna RRR మూవీకి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కినందుకు గాను ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ముఖ్యంగా మన టాలీవుడ్ సెలెబ్రిటీల నుండి కూడా ప్రతీ ఒక్కరు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకడు. ఈయన నేడు కాసేపటి క్రితమే ఆస్కార్ అవార్డు గెలుపొందినందుకు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియచేసాడు.

కానీ ఆ పాట ఆ రేంజ్ లో రీచ్ అవ్వడానికి ప్రధాన కారణమైన హీరోల పేర్లు మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. కొంతమంది అభిమానులు అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు తియ్యడం ఇష్టం లేకనే బాలయ్య అలా చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి మరియు బాలయ్య కి మధ్య సరిగా మాటలు లేవని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో మరియు మెయిన్ మీడియా లో ప్రచారం అవుతున్న మాట.

మొన్న తారకరత్న పెద్ద ఖర్మ రోజు కూడా ఎన్టీఆర్ ని సరిగా బాలయ్య పలకరించలేదని సోషల్ మీడియా లో అభిమానులు తెగ ఫీల్ అయిపోయారు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన చెప్పిన విషెస్ లో ఎన్టీఆర్ పేరు తియ్యకపోవడం తో మరింత హర్ట్ అయ్యారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంత బాలయ్య బాబు ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాము,’#RRR మూవీ కి ఆస్కార్ అవార్డు దక్కినందుకు గాను చిత్ర బృందం మొత్తానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’.

”బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ లో మనకి ఆస్కార్ అవార్డు దక్కడం అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లాంటిది.సంగీత దర్శకుడు కీరవాణి మరియు చంద్రబోస్ కి ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మూవీ తమిళ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ కి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలిజేస్తున్నాను’ అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.