Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..ప్రభాస్ అందుకు పనిరాడంటూ..

- Advertisement -


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈశ్వర్ సినిమా తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. డార్లింగ్, మిర్చీ లాంటి రొమాంటిక్ సినిమాల లో నటించి అమ్మాయిల మనసును గెలుచుకున్నాడు. బాహుబలి లాంటి చారిత్రాత్మకమైన చిత్రాలలో నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు Prabhas .ఆ సినిమా ఘన విజయాన్ని అందుకోవడం తో పాటు కాసుల వర్షాన్ని కురిపించింది.ఆ సినిమా తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది..

prabhas kriti sanon
prabhas kriti sanon

భారీ యాక్షన్, భారీ బడ్జెట్ తో ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు ఆదిపురుష్, సలార్,ప్రాజెక్ట్ కె వంటి భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు..ఆ సినిమాలు అన్నీ షూటింగ్ దశలో బిజిగా ఉన్నాయి.వచ్చే ఏడాది సినిమాలు అన్నీ విడుదల కానున్నాయి.ఇది ఇలా ఉండగా, ప్రభాస్ కు పెళ్ళి వయస్సు దాటి పోతుందని పెళ్ళి చేసుకొవాలని కొందరు అంటున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో అనుష్క తో పెళ్ళి అంటూ రుమెర్స్ వచ్చాయి.. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ రావడంతో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాష్, కృతి సనన్ పెళ్ళి అంటూ వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌, డార్లింగ్ ప్రభాస్‌ ప్రేమలో ఉన్నారనే గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. వరుణ్‌ ధావన్‌.. చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. అంతేకాకుండా ప్రభాస్‌, కృతి కలిసి ఆది పురుష్‌ చిత్రంలో నటిస్తుండడం, ప్రభాస్‌ అంటే తనకు ఇష్టమని గతంలో కృతి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి. దీంతో ఈ అంశం ఒక్కసారిగా టాలీవుడ్‌, బాలీవుడ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -

కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఈ జంట వివాహం చేసుకోనుందని, త్వరలోనే నిశ్చితార్థం కానుందని తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తపై అటు ప్రభాస్‌ కానీ, ఇటు కృతి కానీ స్పందించలేరు. దీంతో వైరల్‌ అవుతోన్న వార్తకు చెక్‌ పెట్టాలనుకున్న కృతి సనన్‌ ఎట్ట కేలకు ఓపెన్‌ అయ్యింది.వెబ్‌సైట్స్‌ మా పెళ్లి తేదీ కూడా ప్రకటించక ముందే నేను ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లు మాత్రమే’,ప్రభాస్ తో పెళ్ళి అనే ఆలోచన కూడా కలలో కూడా రాలేదు.. అతను నాకు మంచి ఫ్రెండ్ అని స్పష్టతనిచ్చింది.. ఇప్పటిలో పెళ్ళి ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here