Samyuktha : అదొక చెత్తతో సమానం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్

- Advertisement -

కేరళ కుట్టి సంయుక్త మీనన్ (Samyuktha Menon) గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సంయుక్తా. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రానా సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె బింబిసారలోను నటించి అదరగొట్టింది. తాజాగా ఆమె నటించిన విరూపాక్ష ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఆమెది గోల్డెన్ లెగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

samyuktha
samyuktha

కొందరు అభిమానులు ఆమెను ఐరన్ లెగ్ అంటూ విమర్శించినప్పటి వీడియోస్ ను షేర్ చేస్తున్నారు. విరూపాక్ష టీమ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ హీరోయిన్‌ను ప్రశ్నిస్తూ.. టాలీవుడ్‌కు గోల్డెన్ లెగ్‌గా మారారు.. మీ స్పందన ఏంటీ.. అని అడగ్గా.. సంయుక్తా మీనన్ స్పందిస్తూ.. గోల్డెన్ లెగ్, లేక ఐరన్ లెగ్ అనేది ఓ ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్.. సినిమా హిట్ అనేది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుందని.. ఓ సినిమా హిట్ అవ్వగానే గోల్డెన్ లెగ్ అని.. ఆ తర్వాత ఫ్లాప్ పడగానే ఐరన్ లెగ్ అనడం ఓ చెత్త కాన్సెప్ట్ అంటూ చురకలు అంటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Actress samyuktha
Actress samyuktha

విరూపాక్ష సినిమా పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. ఇక సంయుక్తా మీనన్ విషయానికి వస్తే… మలయాళం, తమిళంతో పాటు కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగులో మొదట పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటికి జోడిగా నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here