Baby : ‘వాల్తేరు వీరయ్య’ రికార్డుని బద్దలు కొట్టిన ‘బేబీ’.. ఇది మామూలు అరాచకం కాదు!

- Advertisement -

Baby ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా సృష్టించిన ఒక రికార్డు ని రీసెంట్ గా విడుదలైనా ‘బేబీ’ అనే చిన్న సినిమా బ్రేక్ చేసిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Baby
Baby

వాళ్ళు చెప్తున్న లెక్కన ప్రకారం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు కోటి పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మళ్ళీ ఈ ఏడాది అలా నాన్ స్టాప్ గా 12 రోజులు కోటికి పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమా రాలేదు. కానీ ఇప్పుడు ‘బేబీ’ సినిమా ఈ రికార్డుని బద్దలు కొట్టి 12 రోజులు కాదు, ఏకంగా రెండు వారాల వరకు కోటి రూపాయిలు వరకు నాన్ స్టాప్ గా షేర్ వసూళ్లను సాధించిన చిత్ర్రం నిల్చింది బేబీ.

నిన్న కూడా ఈ చిత్రం కోటి 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఈరోజు కూడా అదే రేంజ్ వసూళ్లను రాబడుతుందని, పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం వచ్చే వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు. ఈ రేంజ్ ఫీట్ ప్రస్తుతం స్టార్ హీరోలకు కూడా కష్టమే.

- Advertisement -

ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయిల షేర్ అవసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయిల షేర్ ని రాబడుతుందని, అలా ఈ ఏడాది నిర్మాతలకు బయ్యర్స్ కి అత్యధిక లాభాలను రాబట్టిన సినిమాగా ‘బేబీ‘ చరిత్ర సృష్టిస్తుందని అంటున్నారు. మరి రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య క్రేజ్ అయితే వేరే లెవెల్ కి రీచ్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here