Baby : రే*ప్ చేసి చంపేస్తామన్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బేబీ’ సినిమా నటిBaby : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ‘బేబీ’. చిన్న సినిమాగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నెగిటివ్ రోల్ పోషించిన న‌టి కిర్రాక్ సీత‌. ఆమె పాత్ర‌లో జీవించింది అనే చెప్పాలి. అయితే.. ఆన్‌స్రీన్ నెగెటివ్ క్యారెక్ట‌ర్ వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సీత వెల్ల‌డించారు. అత్యాచారం చేస్తామ‌ని, చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఆమె తెలిపింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విష‌యాల‌ను చెప్పింది. ఓ ఈవెంట్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా కొంద‌రు అబ్బాయిలు త‌న‌ను అనుస‌రించార‌ని తెలిపింది.

Baby
Baby

స్నేహితుల‌కు ఫోన్ చేసి విష‌యాన్ని చెప్ప‌గా వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చిన‌ట్లు చెప్పింది. అయితే తాను అలా చేయ‌లేదంది. ఇంకొంద‌రు అయితే త‌న‌ను అత్యాచారం చేస్తాం, చంపేస్తామ‌ని బెదిరించార‌ని, మ‌రికొంద‌రు త‌న‌ అడ్ర‌స్ తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పుకొచ్చింది. అయితే.. వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని, త‌న రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ ఎంటో వారికి తెలియ‌దు కాబ‌ట్టే వారు అలా ప్ర‌వ‌ర్తించి ఉంటారంది. రీల్ లైఫ్‌, రియ‌ల్ లైఫ్ కు మ‌ధ్య చాలా వ్య‌త్సాసం ఉంటుంద‌ని తెలిపింది. ప్రేక్ష‌కులు రీల్ లైఫ్, రియల్ లైఫ్ ల మధ్య తేడాను గుర్తించలేకపోవడం దురదృష్టకరమంది. ‘బేబీ’ సినిమాలో త‌న క్యారెక్ట‌రైజేష‌న్ వ‌ల్ల‌ ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ద‌ర్శ‌కుడు సాయి రాజేశ్ త‌న‌కు ముందే చెప్పిన‌ట్లు సీత తెలిపింది. యూట్యూబ‌ర్ స‌ర‌యుతో క‌లిసి సీత గ‌తంలో వ‌ర్క్ చేసింది. ఆ త‌రువాత ఏమైందో తెలియ‌దు గానీ అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం సినిమాల్లో బోల్డ్ త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

మరోవైపు పెద్దగా ఫేమ్ లేని యువ నటీనటులతో తీసిన ‘బేబీ’.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. పదో రోజు కూడా దాదాపు అదే టెంపో మెంటైన్ చేస్తోంది. ప్రస్తుత కాలంలో ఓ సినిమా వారంపాటు థియేటర్లలో ఆడటమే గగనమైపోయింది. అలాంటిది ‘బేబీ’ రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్ వసూలైంది. పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ‘బేబీ’ చిత్రానికి ఈ ఆదివారం రూ.3.40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మిడ్ రేంజ్ సినిమాల్లో 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’ చిత్రాలతో పాటు అల్లు అర్జున్ ‘సరైనోడు’ కలెక్షన్స్‌ని అధిగమించిందని స్వయంగా దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.