Bro the Avatar : ట్రైలర్ అరుపులే.. వింటేజ్ లుక్స్.. వింటేజ్ కామెడీ.. పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం!

- Advertisement -

Bro the Avatar : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు మేకర్స్. సినిమా విడుదలకు దగ్గర గా ఉందిట్రైలర్ ఇంకా రాలేదు, అప్పుడే ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభం అయిపోయాయి, ఇక ట్రైలర్ లేకపోతే అక్కడ ఒక్క టికెట్ కూడా కదలదేమో అని అభిమానులు చాలా కంగారు పడిపోయారు.

Bro the Avatar
Bro the Avatar

కానీ ట్రైలర్ విడుదల కాకపోయినా కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్ మొత్తం అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకి అక్కడ లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక ట్రైలర్ బాగుంటే ఆకాశమే హద్దు అని అందరూ అనుకున్నారు. అభిమానులు కోరుకున్నట్టుగానే ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ ని ఇంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూసి ఎంత కాలం అయ్యిందో అని ఫ్యాన్స్ ఆనందం తో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ వింటేజ్ సినిమాల్లోని సన్నివేశాలను మరియు పాటలను పవన్ కల్యాణే అనుకరించడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా కింగ్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని స్పూఫ్ చేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన కామెడీ డైలాగ్స్ కేవలం ఆయన అభిమానులను మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటూనే, మరో పక్క ఎమోషన్స్ విషయం లో కూడా పేకాడేసినట్టు ఈ ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అయిపోతుంది.

- Advertisement -

ఇవన్నీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొడుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ ఆడించే ఆట ఎలా ఉండబోతుందో అనేది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులకు సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ ఉంటాడని, వన్ మ్యాన్ షో లెక్క ఉండబోతుందని అనుకుంటున్నారు. చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here