Vaishnav Chaitanya : దొరికేసింది.. తెలుగు తెరకు మరో ఆణిముత్యం దొరికేసింది. ఎవరన్నారు సార్.. తెలుగమ్మాయిల్లో టాలెంట్ లేదని. ఒక్కసారి బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్యను చూడండి. బ్యాగ్ గ్రౌండ్ ఉండి.. ఇప్పటికే అరడజను సినిమాలు చేసిన హీరోలు కూడా ఆమె ముందు తేలియాపోయారు. అది సార్ టాలెంట్ అంటే. ఎక్కడ టిక్ టాక్ వీడియోలు.. ఎక్కడ యూట్యూబ్ వీడియోలు.. ఎక్కడి షార్ట్ ఫిల్మ్స్.. ఎక్కడి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ.

ఎక్కడో పాతబస్తీ నుంచి వచ్చిన ఈ బేబీ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్ లో తన ఫస్ట్ సినిమాతో సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ హీరోయిన్ గురించి మీమ్సే.. రీల్స్. మరి వైష్ణవి వెండితెర దాకా రావడానికి ఎంత కష్టపడింది. అసలు అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఎంటో ఓసారి లుక్కేయండి.
వైష్ణవి చైతన్య అంటే కొందరికే తెలుసేమో కానీ.. సాఫ్ట్ వేర్ డెవలపర్ లో వైష్ణవి అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. షణ్ముఖ్ జస్వంత్ హీరోగా.. వైష్ణవి హీరోయిన్ గా నటించిన ఈ సిరీస్ అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో వైష్ణవి క్యారెక్టర్ కు యువత ఫిదా అయిపోయింది.

ఈ సిరీస్ తర్వాత వైష్ణవికి కాస్త పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో అల్లు అర్జున్ కు చెల్లెలుగా, అలాగే నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘టక్ జగదీశ్’ చిత్రం లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. అలా చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన వైష్ణవి చైతన్య ఇప్పుడు ఇండస్ట్రీ లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. యువ నటుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన బేబీ మూవీ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కింది.
హైదరాబాద్ లోని పాతబస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవికి డ్యాన్స్ అంటే తెగ ఇష్టమట. కూచిపూడి డ్యాన్స్ లో వైష్ణవి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది. కూచిపూడి డ్యాన్స్ ఫామ్ లో వైష్ణవి కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉందట. అంతే కాకుండా 2014వ సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన డ్యాన్స్ పోటీలలో వైష్ణవి చైతన్య కి నెంబర్ 1 స్థానం లో నిలిచిందట. అలా వచ్చిన ఫేమ్ తో ఆమెకు మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు, సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయట.
“హీరోయిన్ కావాలనే లక్ష్యంతో పరిశ్రమకొచ్చా. ఎనిమిదేళ్లైనా అది నెరవేరకపోవడంతో యూట్యూబర్‌గానే ఉండిపోతానేమో అనుకునేదాన్ని. ఆ దశలో సాయిరాజేశ్ ఈ కథ చెప్పినప్పుడు షాక్‌కి గురయ్యా. ఈ పాత్రని నేను చేయగలనా? అనే సందేహం కూడా వచ్చింది. కానీ దర్శకుడే నన్ను నమ్మి, చేయగలవంటూ ధైర్యం చెప్పారు’’. అని బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్ గురించి చెప్పుకొచ్చింది వైష్ణవి.