Tholi Prema : ‘తొలిప్రేమ’ చిత్రం లో నటించిన ఈ కమెడియన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో.. ఏమి చేస్తున్నాడో తెలుసా..?

- Advertisement -

Tholi Prema : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు మామూలు హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తో స్టార్ హీరో అయ్యాడు, యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అప్పట్లో చాలా సార్లు రీ రిలీజ్ అయిన ఈ చిత్రం, రీసెంట్ గా కూడా 4K క్వాలిటీ కి మార్చి విడుదల చెయ్యగా, ఇప్పటికీ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Tholi Prema
Tholi Prema

సినిమాలోని సన్నివేశాలతో పాటుగా మ్యూజిక్ కూడా డాల్బీ అట్మాస్ లో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని కలిగించింది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకం. ఈ సినిమాలోని ప్రతీ సన్నివేశం ఆడియన్స్ మనసుల్ని తాకుతుంది. అంత గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ కరుణాకరన్.

ఇకపోతే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ స్నేహితుల గ్యాంగ్ లో మసిబొగ్గు శ్రీను అనే పాత్ర చేసిన వ్యక్తి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. ఇతని పేరు జగన్ అట. కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే కనిపించాడు, డైరెక్టర్ కరుణాకరన్ కి బాగా కావాల్సిన వ్యక్తి అట అప్పట్లో, సినిమాల మీద మంచి ఆసక్తి ఉండడం తో అతని ఇష్టాన్ని గమనించే తన తొలి సినిమా అయిన తొలిప్రేమ లో అవకాశం ఇచ్చాడు.

- Advertisement -

ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో మంచి గుర్తింపుని దక్కించుకున్న జగన్, ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. చెన్నై ప్రాంతానికి చెందిన ఈయన సినిమాలకు దూరంగా ఒక బ్యాంక్ ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు. ఈయన ప్రస్తుత వృత్తిని తెలుసుకొని ఆడియన్స్ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కమెడియన్ గా ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆయన ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here