Avatar 3 : ‘అవతార్‌3’ కాన్సెప్ట్‌ రివీల్‌ చేసిన డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌

- Advertisement -

Avatar 3 : అవతార్, అవతార్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మరో లోకంలోకి తీసుకెళ్లారు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఈ సినిమా మొదటి రెండు భాగాలు సృష్టించిన వసూళ్ల సునామీ గురించి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన అవతార్-2 కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. పార్ట్ -2 కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే దీనికి మరో సీక్వెల్ కూడా ఉందని ఇంతకుముందే జేమ్స్ కామెరూన్ చెప్పారు.

Avatar 3
Avatar 3

ఇప్పుడు అవతార్-3కి సంబంధించి జేమ్స్ కామెరూన్ ఓ క్రేజీ న్యూస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్ల సునామీని సృష్టిస్తున్న విజువల్‌ వండర్‌ మూవీ ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ ‘అవతార్‌’కు కొనసాగింపుగా జేమ్స్‌ కామెరూన్‌ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ‘అవతార్‌3’ ఎలా ఉంటుంది? ఏ నేపథ్యంలో సాగుతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రేక్షకుల ఉత్సుకత మరింత పెంచేలా ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వెల్లడించారు.

James Cameron

ఇటీవల క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ మూవీ కేటగిరిలో ‘అవతార్‌2’ అవార్డు సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కామెరూన్‌ ‘అవతార్3’ గురించి మాట్లాడారు. అగ్ని ప్రధానంగా మూడో భాగం సాగుతుందని చెప్పారు.

- Advertisement -

‘‘అగ్ని ఒక చిహ్నం.. ప్రయోజనకారి. మూడో భాగంలో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సంస్కృతి మిళతమై కాన్సెప్ట్‌ సాగుతుంది. ఇంతకు మించి చెప్పకూడదేమో. దీంతో పాటు మరో రెండు సంస్కృతులు కూడా మీకు పరిచయం అవుతాయి. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం’’ అని అన్నారు.

ఇదే విషయమై కామెరూన్‌ సతీమణి ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘మీ సీట్‌బెల్ట్‌ మరింత భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం’ ఉంది అన్నారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మూడో భాగం పాండోరాలోని ఎడారిలాంటి ప్రదేశంలో సాగుతుందని హాలీవుడ్‌ టాక్‌. అక్కడ ఉండే సంపదను సొంతం చేసుకునేందుకు మనుషులు ఏం చేశారు? జేక్‌, అతడి కుటుంబ వారిని ఎలా అడ్డుకుంది? ఈ క్రమంలో జేక్‌ కుటుంబానికి ఎలాంటి ఆపద కలిగింది? వంటి అంశాలను కామెరూన్‌ మిళితం చేశారని అంటున్నారు. ఏదైమైనా దీని గురించి మరికొన్ని వివరాలు తెలియాలంటే చాలా కాలం ఆగాల్సిందే!

అవతార్‌2’తో పాటే ‘అవతార్‌3’ చిత్రీకరణ కూడా జేమ్స్‌కామెరూన్‌ దాదాపు పూర్తి చేశారు. కొంత ప్యాచ్‌ వర్క్‌తో పాటు, కీలకమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ పని మిగిలి ఉంది. ఈ సినిమాను 2024 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం చెప్పింది. అంటే మూడో భాగం చూడాలంటే దాదాపు రెండేళ్ల పాటు వేచి చూడాల్సిందే! మరోవైపు ‘అవతార్‌: ది వే ఆఫ్ వాటర్‌’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మొత్తంగా 1.9బిలియన్‌ డాలర్ల (గ్రాస్‌) వసూళ్లు సాధించింది. త్వరలోనే 2 బిలియన్‌ డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com