Ashu Reddy ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ సెన్సేషన్. రోజుకో రకంగా ఫొటోషూట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టించడంలో ఈ భామకు సాటెవరూ రారు. పోటీ ఎవరూ లేరు. తన బోల్డ్ లుక్స్‌తో.. కిల్లింగ్ పోజులిస్తూ కుర్రాళ్లను తన మైకంలో పడేయడం అషూకి చాలా ఈజీ పని. తన అందంతో కుర్రాళ్లను ఊరిస్తూ.. నెట్టింట హీట్ పుట్టిస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా అషూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అషూ చీరకట్టులో కనిపించి మాయ చేసింది.

బోల్డ్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో మరోసారి తన హవా చూపించింది. ఎప్పుడూ బోల్డ్ ఔట్ఫిట్స్లో కుర్రాళ్లను టెంప్ట్ చేసే అషూ ఈసారి ట్రెడిషనల్‌గా కనిపించింది. చీరకట్టులో అభిమానులను ఆకట్టుకుంది. తన కిల్లింగ్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. క్రీమ్ కలర్ డిజైనర్ శారీ కట్టుకుని రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజ్లో అషూ సందడి చేసింది. ఎద అందాలు కనిపించేలా పైట పక్కకు జరుపుతూ.. జుట్టును విరబోసుకుని ఈ బ్యూటీ చాలా ముద్దుగా కనిపించింది. అషూ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. చీరలోనూ అషూ చాలా హాట్‌గా ఉంది గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి డ్రెస్సైనా గ్లామర్ షో మస్ట్ గురూ అంటూ మాట్లాడుకుంటున్నారు. అషూ విరహవేదన చూసి కుర్రాళ్ల గుండెలు విలవిలలాడుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ రోజురోజుకు నెట్టింట టెంపరేచర్ పెంచేస్తుందంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీస్ షేర్ చేస్తూ కామెంట్ బాక్స్ ను తమ ప్రేమతో నింపేస్తున్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ బ్యూటీ డబ్ స్మాష్‌లతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. సరదాగా షురూ చేసినా.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాపులారిటీ వచ్చింది. ఈ భామను జూనియర్ సమంత అనేవాళ్లు అప్పట్లో. కానీ కొన్నాళ్ల తర్వాత కాస్త లావు కావడంతో జూనియర్ సమంత అనే బిరుదు వెనక్కి తీసుకున్నారు నెటిజన్లు. ఇక బొద్దుగా ఉన్న అషు రెడ్డి ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్‌లో ఈ బ్యూటీ ఉంది కొన్నాళ్లే అయినా ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇక ఆ తర్వాత ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతో మరింత క్రేజ్ వచ్చింది. ఆర్జీవీ ద్వారా ఈ భామకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.