‘బేబీ’ కలెక్షన్స్ మొత్తం భూటకమేనా..? సోషల్ మీడియా లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారుగా!

- Advertisement -

రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటి ‘బేబీ’. గత నెల 16 వ తారీఖున విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన కూడా రన్ ఆగడం లేదు.

ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల ‘బ్రో ది అవతార్’ చిత్రం కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతుంది అంటూ సోషల్ మీడియా లో కొన్ని వెబ్ సైట్స్ ప్రచారం చేసాయి. అయితే ఇదంతా ఫేక్ కలెక్షన్స్ అని నిన్న సోషల్ మీడియా సాక్షిగా తేలిపోయింది. అసలు విషయానికి వస్తే ‘బేబీ’ మరియు ‘బ్రో ది అవతార్’ చిత్రాలు హైదరాబాద్ లోని పాపులర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్ లో ఆడుతున్నాయి. బేబీ చిత్రం సంధ్య 70 ఏం ఏం లో ఆడుతుండగా, బ్రో చిత్రం దేవి థియేటర్ లో ఆడుతుంది .

బేబీ కలెక్షన్స్
బేబీ కలెక్షన్స్

అయితే నిన్న నూన్ షోస్ లో బ్రో చిత్రం కంటే బేబీ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయని సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ దురాభిమానులు మొత్తం ఒక రేంజ్ లో దుష్ప్రచారం చేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుమానం వచ్చింది. 20 రోజులు తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో #RRR చిత్రానికి కూడా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టలేదు. కానీ బేబీ కి ప్రతీ రోజు నూన్ షో కి 35 వేల రూపాయిలు ఎలా వస్తున్నాయి?. నూన్ షోస్ కి ఆ రేంజ్ వస్తున్నా సినిమాకి మిగిలిన షోస్ కి అంత మొత్తం లో రావడం లేదు. ఆరాలు తియ్యగా, ప్రతీ రోజు బేబీ మూవీ కి కలెక్షన్స్ డీసీఆర్ రాస్తున్నారని తేలింది.

- Advertisement -
Baby Collections

డీసీఆర్ అంటే డైలీ కలెక్షన్ రిపోర్ట్. అంటే ప్రతీ రోజు వచ్చే కలెక్షన్స్ లెక్కలు అన్నమాట. కొంతమంది దీనిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని రికార్డ్స్ కోసం రాస్తుంటారు. మరికొంతమంది ప్రొమోషన్స్ కోసం కలెక్షన్స్ రాకపోయినా కూడా వచ్చినట్టు థియేటర్ యాజనమాన్యం కి డబ్బులు చెల్లించి చేస్తుంటారు. ‘బేబీ‘ చిత్ర నిర్మాతలు కూడా చేసింది అదే. అయితే కేవలం ప్రొమోషన్స్ కోసం మాత్రమే అలా చేశామని, ఉద్దేశపూర్వకంగా మాత్రం చెయ్యలేదని అభిమానులకు క్షమాపణలు చెప్పడం తో సమస్య సర్దుమణిగింది. అయితే కేవలం ఈ ప్రాంతం లో ఒక్కటే ప్రొమోషన్స్ కోసం లేని కలెక్షన్స్ ని వచ్చినట్టు చూపించారా..?, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో ఇదే తరహా లో వేసారా అనేది చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here