Prabhas : ప్రభాస్ కు కాకుండా ఇకెవ్వరికీ లిప్ లాక్ ఇవ్వని అనుష్క.. ఇప్పుడీ చిన్న హీరోతో అన్ని ఒప్పుకుందా..!

- Advertisement -

Prabhas : అనుష్క శెట్టి – ప్రభాస్ జంట గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ జంటకి చాలా ప్రత్యేకమైన పేరు వుంది. దానికి కారణం లేకపోలేదు. కొటౌట్ విషయంలో ఇద్దరు ఇద్దరే. ఇలాంటి సరిజోడిని ఇంకెక్కడా చూడలేము. దానికి తగ్గట్టే వీరు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్లగా నిలిచాయి. దాంతో ఈ జంట తెలుగునాట చాలా ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలో వీరు పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ కూడా జోరుగా నడిచాయి. అభిమానులు కూడా ఆ వార్త నిజం కావాలని ఆశపడ్డారు. కానీ ఇవి వట్టి రూమర్స్ అని తేలిపోయిన సంగతి అందరికీ తెలిసినదే.

Prabhas :
Prabhas

సూపర్ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన అనుష్క ఆ తరువాత తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ఇకపోతే, కెరీర్ ఆరంభం నుంచి అనుష్క హీరోలతో రొమాంటిక్ సన్నివేశాలు చేసింది. కానీ, ఎప్పుడూ హద్దులు దాటిన దాఖలాలు లేవు. ఆమె తన కెరీర్లో ప్రభాస్ కు తప్పితే మరే హీరోకు లిప్ లాక్ ఇచ్చిన పరిస్థితి లేదు. బిల్లా, బాహుబలి – 2 చిత్రాల్లో ప్రభాస్‌, అనుష్క మధ్య లిప్ లాప్ సీన్ ఉంటుంది. అయితే అనుష్క లిప్ లాక్ ఇచ్చిన హీరోల లిస్ట్ తో ప్రభాస్ తో పాటు ఇప్పుడు మరొక హీరో వచ్చి చేరాడు.

prabhas anushka

అతను మరెవరో కాదు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ జంటగా నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క చెఫ్ పాత్రను పోషిస్తే, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రను పోషిస్తున్నాడు. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన సాంగ్స్‌, టీజర్, పోస్టర్స్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో అనుష్క ముద్దు సీన్లలో నటించిందని టాక్ వినిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here