Tamaannh bhatia : తమన్నా అలాంటి సీన్లలో రెచ్చిపోవడానికి కారణం అదే.. పెద్ద ప్లాన్ వేసిందిగా

- Advertisement -

Tamaannh bhatia : సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ తమన్నా. ఫ్యాన్స్ తో ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలిపించుకునే తమన్నా ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి చేరిపోయింది. 2005 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అమ్మడు ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచింది. అంతే కాకుండా బోల్డ్ సీన్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఆ విషయంలో అమ్మడు లేటెస్ట్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

Tamaannh bhatia :
Tamaannh bhatia :

గతంలో ముద్దు సీన్లకే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బోల్డ్ షోతో ఓటీటీ టాప్ లేచిపోయేలా చేసింది. రెచ్చిపోయి పెర్ఫామెన్స్ చేసింది. గత నెలలో ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే రెండు సిరీస్ ల్లో తమన్నా చాలా ఘాటు పెర్ఫామెన్స్ తో అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే, తమన్నా అలా నటించడానికి అసలు కారణం ఏంటనేది అందరి మదిలో మెదులుతున్న ఓ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికొంది. ప్లానింగ్ ప్రకారమే అలా చేసిందంటూ ఓ న్యూస్ అయితే నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం చూస్తే.. తమన్నా సీనియర్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్తుండటం.. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలు వినిపిస్తున్నాయి.

తమన్నా

18 ఏళ్లుగా తమన్నా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం ఆమె వయస్సు 33 ఏళ్లు. అటుపెళ్లికి నో చెప్పి.. ఇటు కెరీర్ ను ముందుకు నడిపిస్తోంది. మరోవైపు ఇండస్ట్రీలోకి యంగ్ హీరోయిన్లు వచ్చి దుమ్ములేపుతుండటం.. సీనియర్ బ్యూటీలకు సరిగా అవకాశాలు లేకపోవడం ఓకారణం. పైగా తమన్నాకు పెద్ద హిట్లు లేకపోవడంతోనే ఇలా చేసిందంటున్నారు. ఇక దీనిపై తమన్నానే స్వయంగా క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా కథలో భాగంగా శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమను సహజంగా చూపించాలంటే అలాంటి సన్నివేశాలు ఉండటం కీలకమనిపించింది. ఎవరు విమర్శించినా, నచ్చినా? నచ్చకపోయినా కథలో భాగంగా అలా చూపిస్తారు.’ అంటూ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here